fbpx
HomeBig Storyపంజాబ్ లో భారీ విజయాన్ని అందుకున్న ఆప్!

పంజాబ్ లో భారీ విజయాన్ని అందుకున్న ఆప్!

AAP-WON-PUNJAB-ASSEMBLY-ELECTIONS-WITH-92-SEATS

చండీఘడ్: ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇందులో ఒక రాష్ట్రమైన పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ ఘన విజయం సాధించింది.

పంజాబ్ లో ఉన్న 112 అసెంబ్లో స్థానాల్లో ఆప్ ఏకంగా 92 స్థానాలను గెలుచుకుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక బీజేపి కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచింది.

పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో ఇటీవల అంతర కలహాలు ఆ పార్టీని ఎన్నికల్లో బాగా దెబ్బతీశాయి. నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరియు ముఖ్యమంత్రి మధ్య సఖ్యత లేక పార్టి ఓటమిని చవిచూసింది.

పంజాబ్ ఆప్ కు ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన భగవంత్ మాన్ కామెడీ యాక్టర్. అతని ప్రచారం మరియు ప్రజాదరణ ఆప్ పార్టీకి బాగా కలిసొచ్చాయి. ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంది ఎన్నికలు అయ్యే వరకు అహర్నిశలు కృషి చేసి ఆప్ ను ఒంటి చేత్తో గెలిపించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular