fbpx
HomeBusinessఅమెరికాకు చెందిన లీన్‌స్విఫ్ట్‌ సొల్యూషన్స్‌ను కైవసం చేసుకున్న విప్రో!

అమెరికాకు చెందిన లీన్‌స్విఫ్ట్‌ సొల్యూషన్స్‌ను కైవసం చేసుకున్న విప్రో!

LEANSWIFT-ACQUISITION-BY-WIPRO

న్యూఢిల్లీ: భారత ఐటీ మరియు టెక్‌ దిగ్గజం అయిన విప్రో కంపెనీ అమెరికాకు చెందిన లీన్‌స్విఫ్ట్‌ సొల్యూషన్స్‌ అనే కంపెనీను కైవసం చేసుకుంది. లీన్‌స్విఫ్ట్ సొల్యూషన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందంపై సంతకం చేసినట్లు గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కన్సల్టింగ్ కంపెనీ విప్రో బుధవారం రోజున ప్రకటించింది.

ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ సర్వీసెస్ ద్వారా క్లౌడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ బిజినెస్‌ను విస్తరించడానికి విప్రో కంపెనీ వ్యూహానికి అనుగుణంగా కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ టేకోవర్ ప్రక్రియ మొత్తం 2022 మార్చి 31తో పూర్తవనుందని విప్రో బీఎస్‌ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది.

కన్సల్టింగ్, ఇంప్లిమెంటేషన్ స్పేస్ రెండింటిలో లీన్‌స్విఫ్ట్ ఇన్‌ఫోర్ ఇండస్ట్రీ క్లౌడ్ సర్వీసెస్‌లో విప్రో స్థానాన్ని నెలకొల్పుతుందని కంపెనీలు ఒక ప్రకటనలో తెలిపాయి. యూఎస్‌, స్వీడన్ , భారత్‌ అంతటా డెవలప్‌మెంట్ కార్యాలయాలను లీన్‌స్విఫ్ట్ కలిగి ఉంది.

ఈ సముపార్జనతో క్లౌడ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వ్యాపారంలో ఆయా క్లైయిట్లకు మెరుగైన క్లౌడ్‌ ఆధారిత సేవలను అందిస్తామని విప్రో లిమిటెడ్ అప్లికేషన్స్ & డేటా, ఐడీఈఏఎస్, ప్రెసిడెంట్ హరీష్ ద్వారకన్‌హల్లి అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular