fbpx
HomeAndhra Pradeshఏపీలో ఇవాళ నమోదైన తొలి ఒమిక్రాన్ కేసు!

ఏపీలో ఇవాళ నమోదైన తొలి ఒమిక్రాన్ కేసు!

AP-REGISTERS-FIRST-OMICRON-CASE-BY-MAN-FROM-IRELAND

విజయనగరం: భారత్ లో రోజురోజుకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. ఇదే తరుణంలో తాజాగా ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ లో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదయింది. ఐర్లాండ్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి పరీక్షలో ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయ్యింది.

మొదట తనకి ముంబైలోని ఎయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి నవంబరు 27వ తేదీన విశాఖ చేరుకున్నాడు. అయితే తనకు అక్కడ కూడా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయగా నెగెటివ్‌ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఆ వ్యక్తికి మరోసారి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా ఒమిక్రాన్‌ పాజిటీవ్‌గా నిర్ధారణ జరిగింది.

ఆ తరువాత అధికారులు ఆ వ్యక్తి నమునాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పరీక్షల కోసం పంపారు. ఆ వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్థారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. మొత్తం 15 మంది నమునాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా, పది నమూనాలలో ఒకరికి మాత్రమే ఒమిక్రాన్‌ సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు.

కాగా మిగతా ఐదు మంది టెస్టు వివరాలు రావాలని అన్న ఆరోగ్యశాఖ ప్రజలు అనవసర వదంతులు నమ్మి భయపడద్దని తెలిపింది. ప్రజలు అందరూ తప్పకుండా కోవిడ్‌ నిబంధలను పాటించాలని సూచించింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వ్యక్తి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular