fbpx
HomeTop Movie Newsఅదరగొడుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్!

అదరగొడుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్!

RRR-MOVIE-TRAILER-RELEASED-AND-RELEASES-ON-7THJANUARY-2022

మూవీడెస్క్‌: టాలీవుడ్ లో టాప్ హీరోస్ తారక్ మరియు చరణ్, అలాగే దేశంలోనే దిగ్గజ దర్శకుడైన రాజమౌళిల కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా చిత్రంగా రూపు దిద్దుకుంటున్న మోస్ట్‌ అవైటెడ్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. సిల్వర్ స్క్రీన్‌పై మొదటిసారి స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా హీరో రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కు రాజమౌళి చాలా పెద్ద ట్రీట్‌ ఇవ్వబోతున్నారు.

కాగా చాలా పెద్ద బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ సాంగ్స్‌ మరియు మేకింగ్‌ వీడియోలు ఫ్యాన్స్‌కు మంచి ఉత్సాహాన్ని ఇవ్వగా, థియేటర్లలో రిలీజైన ట్రైలర్ ఇప్పుడు‌ ఇంకా హంగామా సృష్టిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం, రణం, రుధిరం) ట్రైలర్‌తో జక్కన్న ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి ఫ్యాన్స్‌ అంతా ఫిదా అయ్యారు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ కూడా లభించిందని తెలుస్తోంది. చిత్ర నిడివి సుమారు మూడు గంటల ఆరు నిమిషాల 54 సెకన్లతో ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రాబొతోంది. ఆర్ఆర్ఆర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రం సుమారు రూ. 400 కోట్లతో తెరకెక్కుతొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular