fbpx
HomeMovie Newsబాలీవుడ్ ని షేక్ చేస్తున్న కోవిడ్

బాలీవుడ్ ని షేక్ చేస్తున్న కోవిడ్

Bachan family affected with Corona Virus

ముంబై: ఇప్పటివరకు అడపాదడపా సెలెబ్రిటీ కరోనా కేసులు కనిపించాయి. కానీ ఒక్కసారిగా బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబం లో నలుగురికి ఒకేసారి కరోనా రావడం తో బాలీవుడ్ లో కరోనా ప్రకంపనలు మొదలయ్యాయి. బాలీవుడ్ మెగాస్టార్ట్ అమితాబ్ బచ్చన్ కి, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కి అలాగే కోడలు ఐశ్వర్య రాయ్ మనవరాలు ఆరాధ్య కి కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఒకేసారి కుటుంబం మొత్తం వైరస్ పాకడం ఇప్పటివరకు బాలీవుడ్ లో ఇదే మొదటిది. వీరితో పాటు బాలీవుడ్ లో మరో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుపమ్ ఖేర్ కుటుంబం లో నలుగురికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కానీ వైరస్ వచ్చిందని కుంగిపోకుండా వీడియోస్ షేర్ చేస్తూ తమని అభిమానించే వాళ్లలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు ఈ స్టార్స్. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా లో వీళ్ళందరూ తొందరగా రికవర్ అవ్వాలని ప్రార్థిస్తున్నారు. అమితాబ్ ని ఐతే ‘మీరొక ఫైటర్ ఎప్పటిలాగే కరోనా తో విజయం సాధించి నవ్వుతూ హాస్పిటల్ నుండి బయటకి రావాలి అని కోరుకుంటున్నాం’ అని పోస్ట్ లు పెట్టారు.

అసలు లొక్డౌన్ నుండి బయటకి రాని అమితాబ్ కి కొరోనా ఎలా వచ్చిందని అందరూ ఆశ్చర్య పోతున్నారు. కొన్ని రోజుల క్రితం కౌన్ బనేగా కరోడ్ పతి కొత్త సీజన్ కోసం ఆడిషన్స్ జరిగాయి. అందుకు సంబంధించి ముంబయి లోని ఒక స్టూడియోకు అమితాబ్ వెళ్ళాడు. ఆ సమయంలో మాస్క్ ధరించే ఉన్నాడు. అయినా కూడా ఆయనకు అక్కడికి వెళ్లిన సమయంలోనే ఆయనకు వైరస్ సోకి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ద్వారా ఆ కుటుంబంలోని మిగతావాళ్ళకి సోకి ఉంటుందని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. మంచి విషయం ఏంటంటే ఇప్పటివరకు కోవిడ్ పాజిటివ్ స్పష్టం ఐన వీళ్ళందరికీ ఆరోగ్యం నిలకడగానే ఉంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular