fbpx
HomeAndhra Pradeshఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా!

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా!

JAKIA-KHANAM-DEPUTY-CHAIRPERSON-OF-AP-LEGISLATIVE-COUNCIL

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ పదవి లో తొలిసారి మైనారిటీ మహిళ చోటు సంపాధించింది. వైసీపీ ఎమ్మెల్సీ అయిన జకియా ఖానమ్ ఏపీ శాసనమండలికి‌ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు.

పదవి బాధ్యతలు స్వీకరణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జకియా ఖానంను స్వయంగా కూర్చీ వద్దకు తీసుకెళ్లారు. ఆమె ముఖ్యమంత్రికి తన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చైర్పర్సన్ జకియా మాట్లాడుతూ తనకు ఈ గౌరవప్రదమైన స్థానానికి తనను అర్హురాలుగా గుర్తించి మంచి ఉద్దేశంతో పదవి ఇచ్చినందుకు సీఎం జగన్‌కు రుణపడి ఉంటానని సభాముఖంగా అన్నారు.

ఆమె మాట్లాడుతూ దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా ఉందన్నారు. ఒక సాధారణ గృహిణిగా ఉన్న తనకు సముచిత స్థానాన్ని కల్పించినందుకు మైనార్టీలందరూ హర్షించారని ఆమె పేర్కొన్నారు. మైనార్టీల సామాజిక, ఆర్టిక, రాజకీయ ఎదుగుదలకు తోడ్పడుతానని ఆమె భరోసా ఇ‍చ్చారు.

జకియా ఖానమ్‌ నేపథ్యం:
పేరు: మయాన జకియా ఖానమ్‌
భర్త: దివంగత ఎం.అఫ్జల్‌ ఖాన్, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌
సంతానం: ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు
చదువు: ఇంటర్మీడియెట్‌
పుట్టిన తేది: జనవరి 01, 1971
స్వస్థలం: రాయచోటి, వైఎస్సార్‌ జిల్లా
రాజకీయ నేపథ్యం: ఎమ్మెల్సీ (ఆగస్టు 20, 2020 నుంచి).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular