fbpx
HomeInternationalవిదేశీ ప్రయాణికులపై ఆంక్షలు సడలించిన అమెరికా!

విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు సడలించిన అమెరికా!

AMERICA-LIFTS-TRAVEL-BAN-ON-OTHER-COUNTRIES

వాషింగ్టన్‌: ప్రపంచమంతా సెకండ్ వేవ్ ఉధృత పెరిగిన నేపథ్యంలో పలు దేశాలు వారి దేశాలకు వచ్చే విదేశి ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. భారత్‌ సహా వివిధ దేశాలపై ప్రయాణాల ఆంక్షలను అగ్రరాజ్యం అమెరికా ఎత్తివేసింది.

వచ్చే నెల నవంబర్‌ 8వ తేదీ నుండి విదేశీ ప్రయాణికులకు తమ దేశంలోకి అనుమతినిస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అయితే విదేశాల నుండి వచ్చే విదేశీ ప్రయాణికులు విమానం ఎక్కడానికి ముందు కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్ ను‌ సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రయాణ ఆంక్షల్ని ఎత్తివేసే ఉత్తర్వులపై సోమవారం సంతకం చేసినట్టు వైట్ హౌస్ వెల్లడించింది.

రెండవ కోవిడ్ వేవ్‌ కేసులు అధికంగా ఉన్న తరుణంలో వివిధ దేశాలపై ఆంక్షల్ని విధించిన అమెరికా ఇప్పుడు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎత్తివేస్తున్నాం అని తెలిపింది. రెండు కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న వారికి మా దేశంలోకి ఇక నుండి అనుమతి లభిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణాలు సురక్షితంగా ఉండేలా చర్యలు ఉంటాయ్‌ అని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. నవంబర్‌ 8 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రాబోతున్నాయి.

కాగా విదేశీ ప్రయాణికులలో 18 ఏళ్లలోపు వారికి మాత్రం వ్యాక్సినేషన్‌ నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది. 10 శాతం కంటే తక్కువగా వ్యాక్సినేషన్‌ జరిగిన సుమారు 50 దేశాల ప్రయాణికులపై కూడా అమెరికా ఆంక్షల్ని సడలించింది. ఆయా దేశాల నుంచి వచ్చేవారు 72 గంటల ముందు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌ సర్టిఫికెట్‌తో రావాల్సి ఉంటుందని తెలిపింది. వారు అమెరికాలో 2 నెలల కంటే ఎక్కువ రోజులు ఉంటే వ్యాక్సిన్‌ మాత్రం తప్పనిసరి.

అమెరికా ఈ కొత్త నిబంధనల వల్ల విదేశీ ప్రయాణికులు 2 డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాలి. కరోనా నెగెటివ్‌ ధ్రువీకరణ పత్రాన్ని తప్పకుండా సమర్పించాలి. మాస్కులు, భౌతికదూరం వంటి నిబంధనలు కూడా తప్పనిసరి. ఇవన్నీ అమెరికన్లు, విదేశీ ప్రజల భద్రత కోసమే తీసుకువచ్చాం అని వైట్‌హౌస్‌ అధికారి ఒకరు తెలిపారు. యూకే, ఈయూ, ఐర్లాండ్, చైనా, భారత్, దక్షిణాఫ్రికా, ఇరాన్, బ్రెజిల్‌ వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై 2020 లోనే అమెరికా ఆంక్షలు విధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular