fbpx
Saturday, April 27, 2024
HomeTop Movie Newsమా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన మంచు విష్ణు ప్యానల్‌!

మా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన మంచు విష్ణు ప్యానల్‌!

MANCHUVISHNU-RELEASED-ELECTION-MANIFESTO-FOR-MAA-ELECTIONS

మూవీ డెస్క్: మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలలో మంచు విష్ణు తమ ప్యానల్‌ని గెలిపిస్తే ఒక ప్రత్యేక యాప్ ను తయారు చేయించి దాని ద్వారా సినిమా నటులందరికి అవకాశాలు కల్పించడంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి అర్హులైన కళాకారులకు ఒక సొంత ఇల్లు కట్టిస్తామని ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంచు విష్ణు ఇవాళ తన మానిఫెస్టో ద్వారా ప్రకటించారు. ఈ మేరకు గురువారం తన ఫ్యానల్‌కు సంబంధించిన మేనిఫెస్టోని విడుదల చేశారు.

సినీ హీరో మంచు విష్ణు తమ ప్యానెల్‌ ద్వారా విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:
-> ప్రత్యేక యాప్ ఒకటి తయారు చేసి దాని వల్ల అందరికి అవకాశాలు ఇప్పిస్తామన్నారు
-> అర్హులైన మా అసోషియేషన్ సభ్యులకు సొంత ఇళ్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించడానికి ప్రయత్నం!
-> మా సభ్యుల పిల్లల చదువుల కోసం ఆర్థిక చేయూత
-> తన సొంత డబ్బులతో ‘మా’ భవనం కట్టిస్తామన్న మంచు విష్ణు
-> ప్రతీ ఒక్కరికి ఉచితంగా వైద్య సదుపాయాలు
-> అసోషియేషన్ లో ఉన్న మహిళల రక్షణకి హై పవర్ కమిటీ
-> అర్హులైన సభ్యులకు పెన్షన్లు
-> ‘మా’ సభ్యత్వ ఫీజు రూ.75 వేలకు తగ్గింపు
-> ‘మా’ సభ్యుల కోసం జాబ్‌ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular