fbpx
HomeTop Movie Newsబిగ్ బాస్ 5 రెమ్యునరేషన్‌తో చిన్నారి ప్రాణం కాపాడిన ఉమాదేవి!

బిగ్ బాస్ 5 రెమ్యునరేషన్‌తో చిన్నారి ప్రాణం కాపాడిన ఉమాదేవి!

BHAGYAM-HELPED-BONECANCER-CHILD-WITH-BIGGBOSS-REMUNERATION

హైదరాబాద్: కార్తీకదీపం లో అర్ధపావు భాగ్యంగా ఎంతగానో ఫేమస్‌ ఐన ఉమాదేవి బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో అడుగు పెట్టింది. తాను బిగ్ బాస్ హౌస్లో ఉన్నది రెండు వారాలు మాత్రమే అయినప్పటికీ హౌస్‌లో ప్రతి ఒక్కరినీ గడగడలాడించి ఠారెత్తించింది. హౌస్ లో నామినేషన్స్‌ వస్తే చాలు పూనకం వచ్చినట్లు ఊగిపోయేది.

హౌస్ లో అందరితో మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ప్రవర్తించింది. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లు దాదాపు అందరితోనూ గొడవపడి బిగ్‌బాస్‌ షోలో గయ్యాళి గంపగా పేరు తెచ్చుకున్న ఉమాదేవి తాజాగా ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. బిగ్ బాస్ సీజన్ 5 కోసం తనకు వచ్చిన రెమ్యునరేషన్‌ను ఒక మంచి పని కోసం వినియోగించింది.

బిగ్‌బాస్ సీజన్ 5‌ వల్ల తనకు వచ్చిన పారితోషికంలోని కొంత మొత్తాన్ని బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక చిన్నారిని కాపాడడానికి అందించింది. ఈ విషయం తెలిసాక నెటిజన్లందరూ ఉమాదేవి యొక్క మంచి మనసును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఉమాదేవి గొంతే కాదు, మనసు కూడా పెద్దదే అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రాణాపాయంలో ఉన్న ఒక చిన్నారికి ప్రాణం పోసిన ఉమాదేవికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు. ఆమె వెళ్లిపోయాక షోలో పస లేకుండా పోయిందని, కేవలం నస మాత్రం ఉందని, వీలైనంత త్వరగా ఉమాదేవి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరికొందరు నెటిజన్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular