fbpx
Monday, April 29, 2024
HomeInternationalయస్ బ్యాంక్ కుంభకోణం కేసులో వేల కోట్లు అటాచ్ చేసిన ఈడీ

యస్ బ్యాంక్ కుంభకోణం కేసులో వేల కోట్లు అటాచ్ చేసిన ఈడీ

YES_BANK_MONEY_LAUNDERING_CASE ED ATTACHMENT

యస్ బ్యాంక్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి YES బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రానా కపూర్ మరియు దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ (DHFL) ప్రమోటర్లకు చెందిన రూ.2,600 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED ) గురువారం తాత్కాలికంగా ఏటాచ్ చేసింది. యస్ బ్యాంకు కుంభకోణంలో రానా కపూర్, డిహెచ్ఎఫ్ఎల్కి చెందిన కపిల్, ధీరజ్ వాదవన్ కు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరికి చెందిన భారతీయ మరియు విదేశాలకు చెందిన 2,600 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గురువారం నాడు ఈడీ ఏటాచ్ చేసింది.

దీనికి సంబంధించి ముంబైలోని పెద్దార్ రోడ్‌లో ఉన్న ఒక బంగ్లా, మలబార్ హిల్ ప్రాంతంలోని ఖరీదైన ఆరు ఫ్లాట్లు, ఢిల్లీలోని అమృత షెర్గిల్ మార్గ్ వద్ద ఉన్న 48 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
కపూర్ కి భారత్లో ఇండియాబుల్స్ రూ.1,200 కోట్లు విలువతో పాటు, లండన్ లోని సంస్థ డోయిట్ క్రియేషన్ జెర్సీ లిమిటెడ్, రూ .83 కోట్ల పెట్టుబడిని కలిగి ఉంది. అలాగే లండన్ లోని 77 సౌత్ ఆడ్లీ స్ట్రీట్ వద్ద 11.5 మిలియన్ బ్రిటిష్ పౌండ్ల విలువైన గెస్ట్ హౌస్ మరియు మరొక నివాస ఆస్తి ఉన్నాయి.
వీటితోపాటు న్యూయార్క్‌లో ఒకటి, ఆస్ట్రేలియాలో ఒకటి, లండన్ లోని కమర్షియల్ ప్రాపర్టీస్తో పాటు ఐదు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

రాణా కపూర్‌పై ఈడీ, సీబీఐ ఇప్పటికే క్రిమినల్ కేసులను నమోదు చేశాయి. కపూర్, అతని కుటుంబ సభ్యులు, ఇతరులు 4,300 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ ఆరోపించింది.

ఇవికాక కపూర్‌కు చెందిన మరికొన్ని ఖరీదైన ఆస్తులు లుటియెన్స్ ఢిల్లీ 18 కౌటిల్య మార్గ్, మరియు 20 సర్దార్ పటేల్ మార్గ్‌లలో ఉన్నాయని ఈడీ గుర్తించింది. ఆయనకు అలీబాగ్, మహారాష్ట్రలో 7.5 ఎకరాల బీచ్ ఫ్రంట్ స్థలం ఉంది అని కూడా గుర్తించింది.

‌మార్చిలో అరెస్టు అయిన రానా కపూర్ క్విడ్‌ప్రోకో కింద డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సహా పలు సంస్ధలకు భారీగా రుణాలు మంజూరు చేసినట్టు ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది. కాగా, కపూర్ మరియు వాదవన్ సోదరులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular