fbpx
HomeMovie News25 వ సినిమా మొదలుపెట్టిన సత్యదేవ్

25 వ సినిమా మొదలుపెట్టిన సత్యదేవ్

Satyadev 25thMovie Launch

టాలీవుడ్: పదేళ్లుగా కెరీర్ లో కష్టపడుతూ కారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ గత రెండు సంవత్సరాలుగా వరుస సక్సెస్ లు సాధిస్తూ ప్రస్తుతం మంచి ఆఫర్లతో దూసుకుపోతున్న హీరో సత్యదేవ్. దాదాపు రెండు సంవత్సరాలుగా లాక్ డౌన్ అని అందరు హీరోలు షూటింగ్లు ఆపివేసి ఎదురుచూస్తుంటే సత్యదేవ్ మాత్రం వరుస సినిమాలు చేస్తూ విడుదల చేస్తున్నాడు. మొదటి లాక్ డౌన్ టైం లో తెలుగులో విడుదలైన మొదటి డైరెక్ట్ ఓటీటీ సినిమా ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో అనూహ్యమైన విజయం తో పాటు నటుడిగా కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా విజయం తర్వాత ఎన్నో సినిమాలు సైన్ చేసాడు సత్యదేవ్.

సినిమాలే కాకుండా కరోనా టైం లో చాలా వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు సత్యదేవ్. అప్పుడే 24 సినిమాలు (షూటింగ్ దశలో ఉన్నవి కలుపుకుని) దాటి 25 వ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు సత్యదేవ్. నిన్ననే తన 25 వ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. వి వి గోపాల కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. కీరవాణి కుమారుడు కాల భైరవ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి దిల్ రాజు, హరీష్ శంకర్ కొరటాల శివ వచ్చి సత్యదేవ్ ల్యాండ్ మార్క్ సినిమాకి బెస్ట్ విషెస్ తెలియ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular