fbpx
HomeMovie News'మళ్ళీ మొదలైంది' సుమంత్ లుక్

‘మళ్ళీ మొదలైంది’ సుమంత్ లుక్

SumanthLook From MalleeModalaindi

టాలీవుడ్: ‘మళ్ళీ రావా’ సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన అక్కినేని హీరో సుమంత్ తర్వాత కొన్ని సినిమాలలో కనిపించాడు కానీ అంతగా ఆకట్టుకోలేదు. కెరీర్ లో మొదటి థ్రిల్లర్ సినిమాగా ‘కపటదారి’ అనే సినిమా ద్వారా ప్రయత్నించాడు కానీ అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఒక అర్బన్ మ్యారేజ్ రిలేషన్షిప్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాతో రానున్నాడు. ‘మళ్ళీ మొదలైంది’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకి సంబందించిన కారెక్టర్లు ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నారు సినిమా టీం. ఇప్పటి వరకు సుహాసిని, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, హీరోయిన్ నైనా గంగూలీ క్యారెక్టర్స్ ని పరిచయం చేసిన సినిమా టీం ఈ రోజు సుమంత్ కారెక్టర్ ని పరిచయం చేసింది.

మోస్ట్ కన్ఫ్యూజ్డ్ డివోర్సీ అనే టాగ్ తో హీరో ని పరిచయం చేసింది. పెళ్లి అయ్యి విడాకులు తీసుకుని కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ తో మళ్ళీ పెళ్లి అంటే ఇరిటేషన్ తో, తన ప్రపంచంలో తాను ఉంటూ , ఒక్కడే బ్రతికే కారెక్టర్ లో సుమంత్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. సుమంత్ రియల్ లైఫ్ లో కూడా అలంటి సిచుయేషన్ లో ఉండడం తో ఈ సినిమా సుమంత్ కి బాగా సెట్ అవుతుంది అని సోషల్ మీడియా లో కామెంట్స్ కనిపిస్తున్నాయి. రెడ్ సినిమాస్ సమర్పణలో చరణ్ తేజ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం లో రూపొందుతున్న ఈ సినిమాని టీజీ కీర్తి కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా విడుదల అప్ డేట్ రానున్నట్టు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular