fbpx
Friday, April 19, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie Newsఫైట్ తో మొదలుపెట్టిన లూసిఫర్ రీమేక్

ఫైట్ తో మొదలుపెట్టిన లూసిఫర్ రీమేక్

Lucifer Shoot Started

టాలీవుడ్: ఖైదీ నంబర్ 150 తో కం బ్యాక్ అయిన మెగా స్టార్ చిరంజీవి సైరా నరసింహ రెడ్డి సినిమాతో రెండు సంవత్సరాల క్రితం పలకరించాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాని పూర్తి చేసాడు. ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిరు రెండు సినిమాలని రీమేక్ చేయబోతున్నాడు. మళయాళం లో మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’ సినిమాని డైరెక్ట్ చేసిన ‘మోహన్ రాజా’ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ నిన్ననే మొదలు పెట్టారు.

సినిమా షూటింగ్ యాక్షన్ సీక్వెన్స్ తోనే మొదలుపెట్టారు మెగా స్టార్. ఈ విషయాన్నీ ధృవీ కరిస్తూ డైరెక్టర్ మోహన్ రాజా ఫైట్ మాస్టర్ తో కలిసి ట్వీట్ చేసారు. ఎస్.ఎస్.థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ నెలలో చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఏదైనా అప్ డేట్ ఉండబోతున్నట్టు అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ్ లో అజిత్ నటించిన ‘వేదాళం’ సినిమాని రీమేక్ చేయనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular