fbpx
HomeMovie Newsధనుష్ 'మారన్' ఫస్ట్ లుక్

ధనుష్ ‘మారన్’ ఫస్ట్ లుక్

Dhanush Maaran FirstLook

కోలీవుడ్: కెరీర్ పరంగా ప్రస్తుతం టాప్ గేర్ లో ఉన్న నటుల్లో ధనుష్ ఒకరు. కేవలం ఇండియన్ ఇండస్ట్రీ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నాడు ధనూష్. ప్రస్తుతం అవెంజర్స్ మేకర్స్ తో ఒక హాలీవుడ్ మూవీ, హిందీ లో అక్షయ్ కుమార్ తో ఒక సినిమా, తెలుగు లో శేఖర్ కమ్ములతో ఒక సినిమా, తమిళ్ లో కార్తీక్ నరేన్ తో ఒక సినిమా, తన సోదరుడు సెల్వ రాఘవ దర్శకత్వంలో యుగానికి ఒక్కడు సినిమాకి సీక్వెల్ ఇలా దాదాపు వరుస ప్రాజెక్ట్ లని సెట్ చేసుకుని వచ్చే రెండు మూడు సంవత్సరాలకి గ్యాప్ లేకుండా నటించబోతున్నాడు. ప్రసుతం ధనుష్ 43 వ సినిమాగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రివీల్ చేసారు సినిమా టీం.

‘మారన్’ అనే టైటిల్ తో ఈ సినిమా రానున్నట్టు ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది సినిమా టీం. ఫస్ట్ లుక్ లో ధనుష్ ఒకతన్ని గ్లాస్ పై కొట్టగా బ్రేక్ అయిన గ్లాస్ లో ధనుష్ రిఫ్లెక్షన్ చూపించారు. ఒక్కో రిఫ్లెక్షన్ లో ఒక్కో ఎమోషన్ వచ్చేలా ఫస్ట్ లుక్ ని డిజైన్ చేసి రిలీజ్ చేసారు. ‘ధృవంగల్ పత్తినారు’, ‘మాఫియా’ లాంటి థ్రిల్లర్ మరియు యాక్షన్ సబ్జక్ట్స్ ని రూపొందించిన కార్తీక్ నరేన్ ఈ సినిమాతో మరో యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందించినట్టు అర్ధం అవుతుంది. ఈ సినిమాలో ధనుష్ తో పాటు మాళవిక మోహనన్, స్మృతి వెంకట్ నటిస్తున్నారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెంథిల్ త్యాగరాజన్ మరియు అర్జున్ త్యాగరాజన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జి.వీ.ప్రకాష్ సంగీతంలో ఈ సినిమా రూపొందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular