fbpx
Wednesday, March 27, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie Newsతెర ముందుకి 'దర్శేకేంద్రుడు'

తెర ముందుకి ‘దర్శేకేంద్రుడు’

Raghavendrarao Acting Debut

టాలీవుడ్: శతాధిక చిత్రాల దర్శకుడు, తెలుగు సినిమాలకి కమర్షియల్ హంగులని పరిచయం చేసిన దర్శకుడు, ఎంతో మంది కొత్త హీరోలని, హీరోయిన్ లని పరిచయం చేసిన దర్శకుడు, రాజమౌళి లాంటి ఎంతో మంది టెక్నీషియన్స్ కి గురువు లా వాళ్ళకి సినిమా క్రాఫ్ట్స్ నేర్పిన సీనియర్ డైరెక్టర్ , అందరూ దర్శకేంద్రుడు అని పిలిచే రాఘవేంద్ర రావు గారు మొదటి సారి ఒక పాత్రలో తెర ముందుకు రానున్నారు. 1996 లో రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా ‘పెళ్లి సందడి’. శ్రీకాంత్ కి కెరీర్ లో ఇప్పటికీ మొదటి స్థానంలో ఉండే సినిమా ఇది అంటే తప్పు ఏమి లేదు. దాదాపు 25 సంవత్సరాల తరువాత ఈ సినిమాకి సీక్వెల్ గా ‘పెళ్లి సంద D ‘ అనే సినిమా రాబోతుంది.

శ్రీకాంత్ కొడుకు రోషన్ శ్రీకాంత్ హీరో గా రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ రోజు ఈ సినిమా గురించి ఒక అప్ డేట్ విడుదల చేసి ఆశ్చర్య పరిచింది ఈ సినిమా టీం. ఈ సినిమాలో ‘వశిష్ట’ అనే ఒక ప్రత్యేక పాత్రలో రాఘవేంద్ర రావు నటించనున్నట్టు ప్రకటన చేసి ఒక చిన్న వీడియో కూడా విడుదల చేసారు. వీడియో లో ఒక బాస్కెట్ బాల్ ని కరెక్ట్ గా నెట్ లోకి విసిరేసి జోష్ ఫుల్ గా కనిపించారు. అంతే కాకుండా పెళ్లి సందడి సినిమాలో హీరోయిన్ గా నటించిన దీప్తి భట్నాకర్ కూడా ఈ సినిమాలో రోషన్ కి తల్లి పాత్రలో నటించినట్టు తెలుస్తుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి స్టేజ్ లో ఉంది. గౌరీ రోణంకి అనే దర్శకురాలు ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular