fbpx
HomeInternationalఒలంపిక్స్ వేళ టోక్యోలో ఎమర్జెన్సీ విధింపు!

ఒలంపిక్స్ వేళ టోక్యోలో ఎమర్జెన్సీ విధింపు!

YOSHIHIDE-ANNOUNCED-EMERGENCY-IN-TOKYO-AMID-COVID-CASES-RISE

టోక్యో: టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం అవడానికి మరొక 15 రోజులు మాత్రమే మిగిలి ఉండగా, జపాన్‌ ప్రధాని యొషిహిదె సుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. టోక్యోలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఎమెర్జెన్సీని విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా ఈ ఎమర్జెన్సీ ఒలింపిక్స్‌ పూర్తయ్యేంతవరకు అమలులో ఉంటుందని తెలిపారు.

15 రోజుల్లో ఒలింపిక్స్ జరగనున్న టోక్యో‌లో కరోనా కేసులు అమాంతంగా పెరగడం ఆందోళన కలిగించే విషయమని, నగరంలో కేవలం బుధవారం ఒక్కరోజే 920 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనా వైరస్‌ కొత్త వేరియంట్లు డెల్టా, లాంబ్డా జపాన్ దేశంలోకి ప్రవేశించే ఆస్కారం ఉన్నందున ఒలింపిక్స్‌ నిర్వాహకులు అంతా చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఈ రోజు మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించిన ఆయన, ఈ మేరకు ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ప్రపంచం నలుమూలల నుంచి క్రీడాకారులను వచ్చిన తరువాత, మధ్యలో ఒలింపిక్స్‌ ఆపేయాల్సి వస్తే జపాన్‌కు, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన్‌కు అంతకుమించి ఇబ్బందికర పరిస్థితి మరొకటి ఉండదన్నారు.

ఒక వేళ ఒలంపిక్స్ ఆగిపోతే వచ్చే నష్టం రూ. లక్షల కోట్లలో ఉంటుంది. అందుకే ఒలింపిక్స్‌ సమయంలో నిబంధనలు కఠినతరం చేయడానికి నిర్వాహకులు సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు కరోనా అత్యయిక స్థితిని విధించిన జపాన్​ ప్రభుత్వం, ఒలింపిక్స్‌ పూర్తయ్యేవరకు దాన్ని కొనసాగించడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదివరకే కరోనా వల్ల క్రితం ఏడాది జరగాల్సిన విశ్వక్రీడలు వాయిదా పడ్డాయి.

కరోనా మహమ్మారి మరోసారి విరుచుకుపడటంతో ఈ ఏడాదికి వాయిదా పడిన ఒలింపిక్స్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. టోక్యో ఒలింపిక్స్ కోసం భారత్ నుంచి బయలదేరనున్న అథ్లెట్లు, ఎప్పుడు వెళ్తామో తెలియని అయోమయం‌లో ఉన్నారు. ప్రయాణానికి సంబంధించిన తేదీల విషయాల్లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) నుంచి వేర్వేరు ప్రకటనలు రావడమే ఇందుకు కారణం.

ఒలింపిక్స్‌కు సెలెక్ట్ అయిన అథ్లెట్లలో ఫస్ట్ బ్యాచ్ 17వ తేదీన టోక్యో బయలుదేరుతుందని ఐఓఏ ప్రెసిడెంట్ నరీందర్ బాత్రా మూడు రోజుల క్రితం ప్రకటించారు. అయితే, టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ నుంచి క్లియరెన్స్ వస్తే మాత్రం 14వ తేదీనే ప్రయాణం ఉంటుందని ఐఓఏ నుంచి అథ్లెట్లకు ఇటీవల మెసేజ్ వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular