fbpx
HomeMovie Newsసుక్కు తో విజయ్ దేవరకొండ

సుక్కు తో విజయ్ దేవరకొండ

VijayDevarakonda Sukumar ComboMovieAnnounced

హైదరాబాద్: టాలీవుడ్ లో ఇప్పుడున్న సెకండ్ లీగ్ హీరోల్లో బాగా క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. అన్నీ పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్కుంటూ పోతున్నాడు ఈ హీరో. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘ఫైటర్’ సినిమా చేస్తున్న విజయ్ తన తదుపరి సినిమాని ‘సుకుమార్‘ తో చేయబోతున్నట్టు ప్రకటించారు. విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ “నాలో ఉన్న నటుడు చాలా ఎగ్జయింట్ గా ఎదురు చూస్తున్నాడు. నాలోని ప్రేక్షకుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. మీ అందరికీ గుర్తుండిపోయే సినిమాను ఇస్తామని గ్యారంటీ ఇస్తున్నాను. సుక్కు సార్ తో సెట్స్ లో ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఎదురు చూస్తున్నాను.2022లో ప్రారంభం కానున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా కేదార్ సెలగం శెట్టి నిర్మిస్తున్నారు. నేడు కేదార్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించాడు విజయ్. ప్రస్తుతం విజయ్ , పూరి జగన్నాథ్ కాంబో లో వస్తున్న ‘ఫైటర్’ సినిమా కరోనా వల్ల షూటింగ్ నిలిచిపోయింది. అలాగే విజయ్ మరో బాలీవుడ్ సినిమాలో కూడా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటనలు ఏవీ అయితే లెదు. ఇప్పటి వరకి కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేసిన విజయ్ పెద్ద డైరెక్టర్లతో వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ చేరుకునేందుకు బాగానే కష్టపడుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular