fbpx
HomeMovie Newsలయన్ + టైగర్ = విజయ్ దేవరకొండ 'లైగర్'

లయన్ + టైగర్ = విజయ్ దేవరకొండ ‘లైగర్’

VijayDevarakonda LigerMovie FirstLook

టాలీవుడ్: విజయ్ దేవరకొండ హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. బాక్సింగ్ నేపధ్యం లో రూపొందుతున్న ఈ సినిమా నుండి విజయ్ దేవరకొండ లుక్ బాక్సింగ్ రింగ్ లో ఫైటర్ లాగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో సింహాన్ని, పులి ని చూపించి ‘లైగర్’ అనే టైటిల్ పెట్టి ‘సాలా క్రాస్ బ్రీడ్’ అని కాప్షన్ పెట్టి ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కి జోడీ గా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు.

పూరీ కనెక్ట్స్ బ్యానర్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ , ఛార్మి కౌర్ మరియు కరణ్ జోహార్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొన్నటి వారికి ‘ఫైటర్’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిన ఈ సినిమా టైటిల్ ఈరోజు ప్రకటించారు. పూరి జగన్నాథ్ ఇదివరకు బాక్సింగ్ నేపధ్యం లో ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ అనే సినిమా తీసి హిట్ కొట్టాడు. చాలా రోజుల తర్వాత పూర్తి బాక్సింగ్ నేపధ్యం లో పూరి జగన్నాథ్ నుండి రానున్న సినిమా ఇది. సినిమా విడుదలకి సంబంధించి మరిన్ని వివరాలు కొద్ది రోజుల్లో తెలియనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular