fbpx
Sunday, October 13, 2024
HomeInternationalగూగుల్ కంపెనీకి షాక్ ఇచ్చిన ఇద్దరు ఉద్యోగులు

గూగుల్ కంపెనీకి షాక్ ఇచ్చిన ఇద్దరు ఉద్యోగులు

TWO-EMPLOYEES-QUIT-GOOGLE-FOR-REMOVING-AI-RESEARCHER

శాన్‌ఫ్రాన్సిస్కో : ప్రపంచ సెర్చింజన్‌ దిగ్గజం అయిన గూగుల్ కంపెనీ‌కు ఇద్దరు ఉద్యోగులు రిజైన్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. గత నెలలో కృత్రిమ మేథ (ఏఐ) పరిశోధకుడు టిమ్నిట్‌ గెబ్రూపై గూగుల్‌ వేసిన వేటుని నిరసిస్తూ కంపెనీలోని ఇద్దరు కీలక టెకీలు గూగుల్ సంస్థకు గుడ్‌బై చెప్పారు.

వైవిధ్యం,నైతిక విలువలపై కొనసాగుతున్న వివాదాలు తీవ్రస్ధాయి స్ధాయికి చేరిన నేపథ్యంలో ఇంజనీరింగ్ డైరెక్టర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ గూగుల్ నుంచి నిష్క్రమించడం ఇప్పుడు చర్చకు దారితీసింది.యూజర్‌ భద్రత వ్యవహారాలను పర్యవేక్షించే డేవిడ్‌ బకర్‌ 16 ఏళ్ల పాటు సంస్థతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నానంటూ ప్రటించారు.గెబ్రూ నిష్క్రమణ అనంతరం గూగుల్‌లో తాము కొనసాగదల్చుకోలేదని చెప్పారు.

ఇంకో వైపు సెర్చింజన్‌ దిగ్గజంలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వినీష్‌ కన్నన్‌ గూగుల్‌ను వీడుతున్నట్టు బుధవారం ట్వీట్‌ చేశారు. గెబ్రూ, ఏప్రిల్‌ క్రిస్టియానాల పట్ల గూగుల్‌ దురుసుగా ప్రవర్తించిందనీ, వారికి అన్యాయం జరిగిందంటూ కన్నన్ పేర్కొన్నారు.

గెబ్రూ, క్రిస్టియానా ఇరువురూ నల్ల జాతీయులు కావడం గమనార్హం.మరోవైపు ఈ పరిణామంపై వ్యాఖ్యానించడానికి గూగుల్ నిరాకరించింది. అయితే గెబ్రూ నిష్క్రమణ తరువాత సంస్థపై ఉద్యోగుల నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular