fbpx
Thursday, March 28, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie Newsపవన్ కళ్యాణ్ అభిమానులకి ట్రిపుల్ బొనాంజా

పవన్ కళ్యాణ్ అభిమానులకి ట్రిపుల్ బొనాంజా

ThreeMovie UpdatesFrom PowerstarPawanKalyan

టాలీవుడ్: టాలీవుడ్ లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. వరుసగా పది సినిమాలు ప్లాప్ అయినా కూడా అతని ఫ్యాన్ బేస్ ఏమి తగ్గలేదు. ముఖ్యంగా చెప్పాలంటే అయన యాక్టింగ్ కన్నా ఆయన వ్యక్తిత్వానికి అభిమానులు ఎక్కువ. పార్టీ ప్రారంభించి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలు చెయ్యను అని ప్రకటించినప్పుడు చాలా మంది అభిమానులు నిరాశ చెందారు. కానీ మళ్ళీ సినిమాలు ప్రారంభించడం తో అభిమానుల్లో హుషారు కనిపించింది. ఇంకా చెప్పాలి అంటే ఇండస్ట్రీ లోనే ఎక్కువ మంది ఫాన్స్ ఉన్న హీరో ఎవరంటే ముక్త కంఠంగా పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తుంది.

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాల్ని లైన్ లో పెట్టాడు. ఆ సినిమాలకి సంబందించిన మూడు అప్ డేట్లు రేపు ప్రకటించబోతున్నారు. ఇది ఒక రకంగా ఫాన్స్ కి ట్రిపుల్ బొనాంజా అని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ తన 26 వ సినిమాగా చెయ్యబోతున్న ‘వకీల్ సాబ్‘ నుండి. 27 వ సినిమాగా క్రిష్ తో చెయ్యబోతున్న పీరియాడిక్ సినిమాకి సంబంధించి, 28 వ సినిమాగా చెయ్యబోతున్న పవన్, హరీష్ గబ్బర్సింగ్ కాంబో నుండి మూడు అప్ డేట్లు ఒకేసారి రాబోతున్నాయి. రేపు ఉదయం గం 9.09 నిమిషాలకు వకీల్ సాబ్ నుండి, మధ్యాహ్నం 12.30 నిమిషాలకు క్రిష్ మూవీ నుండి, సాయంత్రం 4.05 నిమిషాలకు హరీష్ శంకర్ మూవీ అప్ డేట్స్ రాబోతున్నట్టు ఆయా సినిమా మేకర్స్ ప్రకటించారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular