టాలీవుడ్: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ పొజిషన్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే థమన్ అని చెప్పవచ్చు. ఎంత ట్రోల్ చేసిన మళ్ళీ వినేది థమన్ పాటలే అని చాలా మంది అనుకుంటారు. ప్రస్తుతం థమన్ చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నాయి. అన్నీ కూడా క్రేజీ సినిమాలే. అందులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ లాంటి టాప్ హీరోల సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడు మరో క్రేజీ ఆఫర్ పట్టాడు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న మలయాళ సినిమా ‘లూసిఫర్’ సినిమా రీమేక్ కి థమన్ సంగీతం అందించనున్నాడు.
ఈ విషయాన్ని థమన్ షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. చిరంజీవి సినిమాకి పని చేయడం తన డ్రీం అని చెప్పుకొచ్చాడు. లూసిఫర్ రీమేక్ కి తెలుగు లో ‘హనుమాన్ జంక్షన్’ సినిమాని డైరెక్ట్ చేసిన మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నటించాల్సిన మిగతా నటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం థమన్ వరుణ్ తేజ్ ‘గని’ సినిమాకి, నాని ‘టక్ జగదీశ్’ సినిమాకి, తమిళ్ లో విజయ్ తో ఒక సినిమాకి, పవన్ కళ్యాణ్ 29 వ సినిమాకి , జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకి ఇలా ఈ సంవత్సరంలో చాలా సినిమాలు థమన్ సంగీతం లో రానున్నాయి. సంక్రాంతికి విడుదలైన ‘క్రాక్’ సినిమాకి కూడా థమన్ ఇచ్చిన బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కి మంచి పేరొచ్చింది. చాలా తక్కువ టైం లోనే 100 సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేసిన థమన్ రెండవ సెంచరీ కూడా తొందర్లోనే పూర్తి చేసేట్టున్నాడు.