fbpx
Thursday, June 8, 2023

INDIA COVID-19 Statistics

44,992,293
Confirmed Cases
Updated on June 8, 2023 9:12 pm
531,886
Deaths
Updated on June 8, 2023 9:12 pm
2,687
ACTIVE CASES
Updated on June 8, 2023 9:12 pm
44,457,720
Recovered
Updated on June 8, 2023 9:12 pm
HomeTelanganaమంత్రులతో కేసీఆర్‌ భేటీ, అసెంబ్లీలో వ్యూహాలపై చర్చ

మంత్రులతో కేసీఆర్‌ భేటీ, అసెంబ్లీలో వ్యూహాలపై చర్చ

TELANGANA-ASSEMBLY-STARTS-SEPTEMBER-7TH

హైదరాబాద్‌ : ఈ నెల 7 నుంచి మొదలయ్యే తెలంగాణ శాసనసభ సమావేశాల్లో అధికార పార్టీ తెరాస అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు, విప్‌లతో సమావేశం నిర్వహించారు. సభలో విపక్షాలు కోరిన అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని, ఎన్ని రోజులైనా అసెంబ్లీని నిర్వహిద్దామని సీఎం అన్నారు.

రాష్ట్రంలోని అంశాలపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు మంత్రులు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. అల్లర్లకు, దూషణలకు అసెంబ్లీ వేదిక కాకుండా ప్రవర్తించాలని పేర్కొన్నారు. జీఎస్టీ అమలులో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సభలోనే చర్చించాలని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అలాగే ఈనెల 7న టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నారు. గురువారం ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్‌తో పాటు మంత్రులు, విప్‌లు పాల్గొన్నారు.

ఈ శాసనసభ సమావేశాల్లోనే రాష్ట్రంలో మొదలు పెట్ట తలచిన కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం చేసిన ముసాయిదా చట్టానికి తుదిరూపునిచ్చి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని ఆయన నిర్ణయించినట్టు సమాచారం. రెవెన్యూ శాఖ ప్రక్షాళన, అవినీతి నిర్మూలన లక్ష్యంగా కొత్తచట్టం రూపకల్పనపై సీఎం గత వారమే సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మరోవైపు దివంగత మాజీ ప్రధానమంత్రి, పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలంటూ వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని కేసీఆర్‌ ఇదివరకే వెల్లడించారు.

శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. బీఆర్‌కేఆర్‌ భవన్‌లో గురువారం వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. శాసనసభలో పెండింగులో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపాలని, అసెంబ్లీ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాసన మండలి సమావేశాలకు సీనియర్‌ అధికారులు హాజరయ్యేలా చూడాలని ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు లేవనెత్తే అంశాలకు సంబంధించి నోట్ చేసుకోవాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular