పూణే: హైదరాబాద్ సన్రైజర్స్ తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ భారీ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 210 పరుగుల భారీ స్కోరు సాధించింది.
భారీ స్కోరు 211 పరుగుల చేధనలో ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎయిడెన్ మార్ర్కమ్ మాత్రమే హైదరాబాద్ తరఫున 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ 40 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు.
రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో చహల్ 3, బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీశారు. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్(27 బంతుల్లో 55) కు తోడు చివర్లో హెట్‌మైర్(13 బంతుల్లో 32) మెరుపులు మెరిపించగా, బట్లర్ 35, పడిక్కల్ 41 కీలకపాత్ర పోషించడంతో 210 పరుగులను చేయగలిగింది.