fbpx
Friday, April 26, 2024
HomeMovie News' Y ' ట్రైలర్ విడుదల

‘ Y ‘ ట్రైలర్ విడుదల

RahulRamakrishna Y MovieTrailerRelease

టాలీవుడ్: లాక్ డౌన్ టైం లో ఓటీటీలకి జనాదరణ బాగా పెరిగింది. ఇదివరకు కేవలం ఇంగ్లీష్ , హిందీ లలోనే ఓటీటీల కోసం ప్రత్యేకంగా సినిమాలు రూపొందించి విడుదల చేసేవారు. ఇపుడు తెలుగులో కూడా అలాంటి సినిమాలు పెరుగుతున్నాయి. దాదాపు ఒక ఆరు నెలల నుండి ఆహా ఓటీటీ వాళ్ళు సూపర్ ఓవర్, భానుమతి వెడ్స్ రామకృష్ణ, కృష్ణ అండ్ హిస్ లీల, కలర్ ఫోటో లాంటి సినిమాలని ఓటీటీలలో విడుదల చేసి మంచి వ్యూస్ తో నడిపిస్తున్నారు. ప్రస్తుతం ‘Y ‘ అనే మరో థ్రిల్లర్ కూడా ఆహా లో త్వరలో స్ట్రీమ్ అవనుంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు.

ఈ సినిమాలో తమిళ హీరో శ్రీకాంత్ (శ్రీ రామ్) మరియు రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషితున్నారు. సీనియర్ డైరెక్టర్ గా శ్రీ రామ్ నటిస్తున్నాడు. ఒక మంచి రైటర్ కోసం వెతుకుతుంటారు. ఆ సమయంలో రాహుల్ రామకృష్ణ రూపం లో ఒక మంచి రైటర్ దొరుకుతాడు. ఇదే సమయం లో సీనియర్ డైరెక్టర్ కి తాగుడు, హీరోయిన్ లతో ఎఫైర్ లు లాంటివి చూపించారు. అంతే కాకుండా అలాంటి టైం లో డైరెక్టర్ పాత్ర చేస్తున్న శ్రీరామ్ తన పేరు, డబ్బు చాలా కోల్పోతాడు. ఆ సమయంలో మరో క్రైం లో ఇరుక్కుంటాడు అన్నట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.

మరి ఈ క్రైం లో రాహుల్ మరియు శ్రీరామ్ పాత్రలు ఏంటి అనేది థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ అన్నట్టు ఆహా వారు ప్రెసెంట్ చేస్తున్నారు. చివర్లో ఆస్తి అంతా కోల్పోయిన తర్వాత తిరిగి సంపాదించుకోవడానికి అందరూ పూరి జగన్నాధ్ కాదు కదా అనే డైలాగ్ తో పూరి ఫాన్స్ ని ఆకట్టుకున్నారు. బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని ఏప్రిల్ 2 నుండి ఆహా ఓటీటీ లో విడుదల చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular