fbpx
HomeBig Storyఅత్యవసర వినియోగ దరఖాస్తు వెనక్కు: ఫైజర్

అత్యవసర వినియోగ దరఖాస్తు వెనక్కు: ఫైజర్

PFIZER-WITHDRAW-EUA-APPLICATION-FROM-INDIA

న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీలలో ప్రపంచంలోనే మేజర్ అయిన ఫైజర్ కరోనా వ్యాక్సిన్ పై సంచలన విషయాన్ని ప్రకటించింది. భారతదేశంలో తన కరోనా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (ఈయూఏ) కోసం చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.

తాజాగా ఫిబ్రవరి 3న జరిగిన భారత డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సమావేశంలో ఫైజర్ తమ ఈ నిర్ణయాన్ని తెలిపింది. భారత్‌లో వినియోగ అనుమతి కోసం అధికారులను సంప్రదించిన దాదాపు రెండు నెలల తర్వాత అత్యవసర పరిస్థితుల్లో తన కోవిడ్ -19 వ్యాక్సిన్ రెగ్యులేటరీ ఆమోద దరఖాస్తును ఉపసంహరించుకోవాలని ఫైజర్ నిర్ణయించినట్లు అమెరికన్ డ్రగ్ దిగ్గజం ఈ రోజు తెలిపింది.

విషయ నిపుణుల కమిటీ సమావేశంలో రెగ్యులేటరీ వారు వ్యాక్సిన్ గురించి అదనపు సమాచారాన్ని అడగడంతో ఫైజర్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాక్సిన్ అతితక్కువ సమయంలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో మరింత అదనపు సమాచారంతో ఇండియాలో అత్యవసర వినియోగ ఆమోదం కోసం మరోసారి దరఖాస్తు చేస్తామని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular