టాలీవుడ్: నితిన్ హీరోగా ఈ సంవత్సరం చెక్ మరియు రంగ్ దే సినిమాలని విడుదల చేసాడు. ఇపుడు మరో సినిమాని కూడా జూన్ 11 న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. హిందీ లో ఆయుష్మాన్ ఖురానా నటించి సూపర్ హిట్ అయిన ‘అందాదున్’ సినిమాని తెలుగు లో నితిన్ హీరోగా రూపొందిస్తున్నారు. ఈ రోజు నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేసారు. కళ్లద్దాలు పెట్టుకుని అంధుడిగా కీ బోర్డు వాయిస్తున్న సీన్ చూపించి ఆ తర్వాత నీళ్లలోంచి నితిన్ కళ్ళు చూపించారు. హిందీ సినిమా చూసిన వారికి ఈ సినిమాలో హీరో అంధుడి పాత్రలో నటించనున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో ఒక ఏజ్ ఎక్కువ ఉన్న ఆంటీ పాత్రలో తమన్నా నటిస్తుంది. నితిన్ కి జోడీ గా నభా నటేష్ నటిస్తుంది. మాస్ట్రో అనే టైటిల్ తో రూపొందిస్తున్న ఈ సినిమాని తన సొంత నిర్మాణ సంస్థ అయిన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి మరియు రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మిస్తున్నారు. వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్, ఎక్ష్ప్రెస్స్ రాజా లాంటి సినిమాలని రూపొందించిన మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. భీష్మ తో నితిన్ కి ఒక హిట్ అందించిన మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. జూన్ 11 న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవబోతుంది. ఈ సినిమాతో ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే నితిన్ మూడు సినిమాలు విడుదల చేసిన ఘనత పొందుతాడు.