fbpx
Friday, April 26, 2024
HomeMovie Newsవరుస సినిమాలు ప్రకటిస్తున్న ఏషియన్ సినిమాస్

వరుస సినిమాలు ప్రకటిస్తున్న ఏషియన్ సినిమాస్

Nikhil20 With AsianCinemas

టాలీవుడ్: ఏషియన్ సినిమాస్ వాళ్ళు మొదలు డిస్ట్రిబ్యూషన్ తో సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఈ బ్యానర్ పై వరుస సినిమాలని లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య , శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ‘లవ్ స్టోరీ’ సినిమాని తీస్తున్నారు. ఈ సినిమా ఈ సమ్మర్ కే విడుదల అవ్వాల్సింది కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. మొన్నే నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ఒక సినిమాని చేస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు. నాగ శౌర్య తో కూడా ఒక సినిమా ప్రస్తుతం షూటింగ్ లో ఉంది. ఇదే క్రమంలో ప్రస్తుతం నిఖిల్ తో కూడా ఒక సినిమా ప్రకటించారు ఈ ప్రొడ్యూసర్స్.

నిఖిల్ కెరీర్లో 20 వ సినిమాగా సోనాల్ నారంగ్ సమర్పణలో నారాయణదాస్ కె నారంగ్ మరియు పుష్కర్ రామ్ ఎమ్ రావ్ కలిసి నిర్మించనున్నారు. నిఖిల్ చివరి సినిమా ‘అర్జున్ సురవరం’ యావరేజ్ గా ఆడినప్పటికీ ప్రస్తుతం నిఖిల్ చేతిలో కార్తికేయ 2 సినిమా సెట్స్ పైన ఉంది. ఈ సినిమాకి మొదటి పార్ట్ డైరెక్ట్ చేసిన చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు ‘కుమారి 21 F’ సినిమాని డైరెక్ట్ చేసిన సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ’18 పేజెస్’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. వీటితో పాటు ఈ సినిమాతో ప్రస్తుతం నిఖిల్ కూడా మూడు సినిమాలు చేతిలో ఉంచుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular