fbpx
Friday, April 26, 2024
HomeMovie Newsగరుడవేగ దర్శకునితో నాగార్జున

గరుడవేగ దర్శకునితో నాగార్జున

Nagarjuna With PraveenSattaru

టాలీవుడ్ : తొమ్మిది సంవత్సరాలనుండి ఇండస్ట్రీ లో ఉన్నా కూడా అంతకముందు రాని పేరు ఒక్క గరుడవేగ సినిమా తోనే టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు ప్రవీణ్ సత్తారు. 2011 లో LBW అనే సినిమాతో టాలీవుడ్ ప్రయాణం ప్రారంభించిన ఈ అమెరికా రిటర్న్ డైరెక్టర్ సందీప్ కిషన్ తో ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘చందమామ కథలు’, ‘గుంటూరు టాకీస్’, ‘గరుడవేగ’ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తాను చేసిన అన్ని సినిమాలు విభిన్న కథలే. ఇపుడు మరో విభిన్న కథతో ముందుకు రాబోతున్నాడు ఈ డైరెక్టర్. ప్రస్తుతం నాగార్జున తో కొత్త సినిమా చేస్తున్నట్టు ఆఫీషియల్ గా ప్రకటించారు.

గ్రీకు వీరుడు, భాయ్ లాంటి వరుస ప్లాపుల తర్వాత నాగార్జున స్క్రిప్ట్ విషయంలో చాల జాగ్రత్తలు పడుతున్నాడు. రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలు కాకుండా వైవిద్యం చూపే కథలతోనే ముందుకు వస్తున్నాడు. నాగార్జున కూడా కొత్త దర్శకులకు, వైవిధ్యమైన సినిమాలని తీయడానికి ముందుంటాడు. చాలా అంచనాల మధ్య విడుదలై రిజల్ట్ తారుమారు అయిన మన్మధుడు 2 సినిమా తర్వాత ఇప్పటివరకు నాగార్జున నుండి సినిమా రాలేదు. ప్రస్తుతం సాల్మన్ అనే కొత్త దర్శకుడితో ‘వైల్డ్ డాగ్’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు నాగార్జున. తన తదుపరి సినిమాని ప్రవీణ్ సత్తారు తో చెయ్యబోతున్నాడు. ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ వారు కె నారాయణ్ దాస్ నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావులతో పాటు శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular