fbpx
HomeMovie Newsఅఖిల్ క్వారంటైన్ లైఫ్

అఖిల్ క్వారంటైన్ లైఫ్

MostEligibleBachelor Quarantine Life

టాలీవుడ్: అక్కినేని అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి జిఏ 2 పిక్చర్స్ పై బన్నీ వాస్ – వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ , సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘మనసా మనసా’ పాత ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో అఖిల్ తో పాటు పూజ హెగ్డే నటిస్తుంది. మా బ్యాచిలర్ & బ్యాచిలరెట్ క్వారంటైన్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి అంటూ ఒక రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసింది ఈ సినిమా టీం.

బొమ్మరిల్లు భాస్కర్ తన ఇదివరటి చిత్రాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉన్నట్టు అర్ధం అవుతుంది. కరోనా లేకపోతె ఏప్రిల్ లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పటికే ఆలస్యం అయింది. ఇప్పుడు లేటెస్టుగా రిలీజ్ చేసిన పోస్టర్ తో ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే 3 సినిమాలు చేసిన కూడా ఆశించిన ఫలితాలు రాలేదని అఖిల్ ఈ సినిమాపైన చాలా ఆశలు పెట్టుకున్నాడు. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా ఇది. ఇప్పుడు ఇద్దరికీ ఈ సినిమా హిట్ అవ్వడం అత్యవసరం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular