టాలీవుడ్: టాలీవుడ్ సీనియర్ మోస్ట్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు అనుబంధం ప్రత్యేకం. వీళ్లిద్దరు దాదాపు ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. మధ్యలో అప్పుడప్పుడు ఒకరి మీద ఒకరు ఛలోక్తులు వేసుకున్నా కూడా ఆ తర్వాత వెంటనే ఏమి జరగనట్టు కౌగిలించుకుని ఫ్రెండ్షిప్ కి చిహ్నం లాగ కనిపిస్తారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరి పైన ఒకరు అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. వీరు మాత్రమే కాకుండా వీరి పిల్లలు కూడా ఫ్రెండ్స్ లా ఉంటారు.
నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మోహన్ బాబు చిరు కి ఒక ప్రత్యేకమైన కానుక ప్రెసెంట్ చేసారు. కొయ్యతో చేసిన ఒక్క బుల్లెట్ బైక్ ను చిరు కి పంపించారు మోహన్ బాబు. దీనిని సోషల్ మిడిల్ లో షేర్ చేసారు చిరంజీవి. “నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి… … థాంక్ యు మోహన్ బాబు” అంటూ ట్వీట్ చేసాడు చిరంజీవి. మోహన్ బాబు పంపిన బైక్ తో పిక్ కూడా షేర్ చేసారు చిరు.