fbpx
Thursday, March 28, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie Newsమోడీ బయోపిక్ 'మనో విరాగి' ఫస్ట్ లుక్

మోడీ బయోపిక్ ‘మనో విరాగి’ ఫస్ట్ లుక్

ModiBiopic Manoviraagi Firstlook

టాలీవుడ్: ఈరోజు భారత దేశ ప్రధాన మంత్రి ‘నరేంద్ర మోడీ’ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు సినిమా టీం. లైకా ప్రొడక్షన్స్, సంజయ్ లీలా భన్సాలీ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి టీ సెల్లర్ నుండి భారత ప్రధాని గా ఆయన జర్నీ ని బయోపిక్ రూపం లో తీసుకురాబోతున్నారు.

ఈ సినిమాని ‘మనో విరాగి’ పేరుతో తెలుగులో, ‘కర్మయోగి’గా తమిళంలో బయోపిక్‌ని రూపొందిస్తున్నారు. ఎస్‌. సంజయ్‌ త్రిపాఠి రచన, దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మహావీర్‌ జైన్‌తో కలిసి బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గురువారం మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెష్‌ చెబుతూ, సినిమా పోస్టర్లు విడుదల చేశారు. ఇందులో మోడీ పాత్రలో అభయ వర్మ నటిస్తున్నారు. మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లోని వాద్‌ నగర్‌, ఉత్తరాఖండ్‌ రాష్టంలోని పలు ప్రదేశాలలో సినిమాని చిత్రీకరణ చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి లైకా అధినేత ఎ. సుభాస్కరన్ మాట్లాడుతూ, ‘ప్రధాని మోడీ టీనేజ్‌ జీవితంలో ముఖ్యమైన మలుపులతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో సమర్పిస్తుండడం హ్యాపీగా ఉంది. ఇది మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular