హైదరాబాద్: మొన్న సడన్ గా చిరు గుండు లుక్ తో సోషల్ మీడియా లో ఒక ఫోటో పోస్ట్ చేసి అందరినీ షాక్ కి గురి చేసారు. అది చూడంగానే అందరికి నిజం గా ఉండు అనే ఆలోచన కలుగుతుంది. కొత్త సినిమా కోసం వేసే ట్రయిల్ లుక్ అనో లేదా ఎలాగూ షూటింగ్స్ లేవు కదా అని తానే కొత్త లుక్ ట్రై చేసాడు అని అనుకున్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది ఫాన్స్ కూడా గుండు కొట్టించుకున్నారు. కానీ అవన్నీ పటా పంచలు చేస్తూ అది ఒరిజినల్ గుండు కాదు అని చెప్తూ మేకింగ్ వీడియో ఒకటి విడుదల చేసి మళ్ళీ షాక్ కి గురి చేసాడు మెగా స్టార్.
ఈ లుక్ ఎలా సాధ్యమైందో చెబుతూ దానికి సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు చిరు. ”ఆ వీడియోకు మేకింగ్ ఆఫ్ ద అర్బన్ మాంక్. ప్రతి ఒక్కరు నమ్మేలా లుక్‌ని మేకోవర్ చేసే ఇండస్ట్రీలోని ప్రతి టెక్నీషియన్‌కి థ్యాంక్స్. సినిమా మ్యాజిక్‌కి సెల్యూట్” అంటూ కామెంట్ పెట్టారు. ఈ వీడియో ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ గెటప్ ఏ సినిమా కోసం అన్నది చిరంజీవి రివీల్ చేయలేదు. చిరు ప్రస్తుతం కొరటాల శివ తో “ఆచార్య” సినిమా చేస్తున్నారు దానికి ఈ లుక్ అవసరం లేదు. కానీ తర్వాత మెహర్ తో చేయనున్న వేదాళం రీమేక్ కు అవసరం ఉంది. అయితే నిజంగానే చిరు ఆ లుక్ లోకి మారారా అంటే లేదనే సమాధానం ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ లుక్ ను ఎలా సిద్ధం చేసారో కూడా చిరు ఇప్పుడు రివీల్ చేసేసారు.
vadevado fan anta vadu kuda alane chesukunnadu, biscuit ai untadhi vadiki.