fbpx
HomeSportsగెలుపు ముఖ్యమా, ఐదు రోజులు ఆడడమా?

గెలుపు ముఖ్యమా, ఐదు రోజులు ఆడడమా?

KOHLI-SAYS-MATCH-WINNING-IMPORTANT-NOT-PLAYING-5DAYS

న్యూఢిల్లీ: మొతేరా క్రికెట్ పిచ్‌పై జరుగుతున్న అనవసరమైన చర్చ ఎందుకో అర్థం కావడం లేదు అని కోహ్లీ అభిప్రాయ పడ్డాడు. మూడో టెస్టులో ఇరువైపుల బ్యాట్స్‌మెన్ ఘోర‌ వైఫల్యం వల్లే ఆ మ్యాచ్‌ రెండు రోజుల్లో ముగిసిందని ఇప్పటికే చెప్పాం. ఇరు జట్లలో బ్యాటింగ్‌ సరిగా చేయకపోవడం, బ్యాటింగ్‌లో కొంత ఓర్పు ప్రదర్శిస్తే పరుగులు వస్తాయని రోహిత్‌ తన ఇన్నింగ్స్‌ ద్వారా చూపించాడు.

అయితే తాము ఇప్పుడు నాలుగో టెస్టు గెలవడంపైనే ఫోకస్‌ పెట్టామని, మా దృష్టిలో మ్యాచ్‌ను ఐదు రోజుల వరకు తీసుకెళ్లే ఆలోచన లేదు, ఎంత త్వరగా ముగిద్దామా అనే అనుకుంటున్నాం. మేము ఆసీస్‌, ఇంగ్లండ్‌ పర్యటనల్లో ఉండి ఇదే పరిస్థితిని ఎదుర్కొని ఉంటే అప్పుడు ప్రశ్నలు సంధించి ఉంటే సంతోష పడేవాళ్లం.

ఎవరైనా సొంత గ్రౌండ్ల‌లో తమకు అనుకూలంగా ఉన్న పిచ్‌లను తయారు చేసుకుంటారన్నది అందరికి తెలిసిన నిజం. అయితే ఇక్కడ నేనే ఒక ప్రశ్న అడుగుదామని అనుకుంటున్నా, ఏదైనా మ్యాచ్‌ గెలవడానికి ఆడతామా, లేక మ్యాచ్ ఐదు రోజులు పాటు పూర్తిగా కొనసాగించడానికి ఆడతామా? నా దృష్టిలో మాత్రం మేం మ్యాచ్ గెలిస్తేనే అభిమానులు సంతోషిస్తారు.

ఆ గెలుపుకు మూడురోజులో లేక ఐదు రోజులు పట్టొచ్చు. పిచ్‌ స్పిన్‌కు బాగా అనుకూలిస్తే మాత్రం ఈ మ్యాచ్‌కు ఐదు రోజులు అవసరం కాకపోవచ్చు. మూడో టెస్టులో అదే జరిగింది. అక్కడ పరుగులు రాకపోవచ్చు, కానీ బౌలర్లు వికెట్లు తీశారు. ఇరు జట్ల బౌలర్లు వికెట్లు తీయడంలో పోటీ పడ్డారు.

ఒక్క మ్యాచ్‌కే ఇలా పిచ్‌ను నిందించడం తప్పు అంటూ చెప్పుకొచ్చాడు కోహ్లీ. కాగా నాలుగో టెస్టులో గెలుపు కష్టమనుకుంటే మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా చాలు. జూన్‌లో లార్డ్స్‌ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఇప్పటికే కివీస్‌ డబ్య్లూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular