fbpx
HomeTelanganaకాళేశ్వరం రికార్డ్‌: వందల టీఎంసీల పంపింగ్‌

కాళేశ్వరం రికార్డ్‌: వందల టీఎంసీల పంపింగ్‌

KALESWARAM-PROJECTS-SETS-RECORD-100TMCS-WATER-PUMPED

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన ప్రపంచంలోనే అత్ పెద్దదైన బహుళ దశల ఎత్తిపోతల పథకం అయిన కాళేశ్వరం తక్కువ కాలంలోనే నీటి పంపింగ్‌లో రికార్డ్ సృష్టించింది. ఈ పథకంలోని ప్రధానమైన నాలుగు పంపింగ్ కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రం నుంచి వంద టీఎంసీల చొప్పున నీటిని ఎగువకు ఎత్తి పోసింది.

ఇందులో లింక్-1లోని మేడిగడ్డ లక్ష్మీ దాదాపు 100 టీఎంసీలకు దగ్గరగా ఉండగా, అన్నారం సరస్వతి, సుందిళ్ల పార్వతి, లింక్-2లో ప్యాకేజ్-8 భూగర్భ గాయత్రి పంపింగ్ కేంద్రాల నుంచి మొత్తం మీద 100 టీఎంసీల చొప్పున పంపింగ్‌ను చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడమే కాకుండా ఆనతికాలంలోనే వందల టీఎంసీల నీటిని ఎంఈఐఎల్ పంపింగ్ చేసి రికార్డు సాధించింది.

ఎన్నో దశాబ్దాలుగా నీరు లేని తెలంగాణ పొలాలు ఇప్పుడు పచ్చని పైరును కప్పుకుని కళకళలాడుతున్నాయి. ఎంతో కాలంగా నీటి కోసం ఎదురుచూసిన రైతన్నలు కాళేశ్వరం నీటి రాకతో తమ బీడు భూములను సస్యశ్యామలం చేసుకుంటున్నారు. ఇంతటి బహుళార్ధక ఎత్తిపోతల పథకం తెలంగాణ దశనే మార్చేసింది.

ఇప్పుడు తెలంగాణ ప్రాంతం కాశేళ్వరం ప్రాజెక్టుతో జలకళను సంతరించుకుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పట్టుదలతో పాటు మేఘా శక్తి సామర్ధ్యాలతో ఇది సాధ్యమైంది. అతి తక్కువ సమయంలోనే ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. భూ ఊపరితలంపైన అతి పెద్దదైన లక్ష్మీ పంప్ హౌస్‌ను జూలై 6, 2019లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. 522 రోజుల పాటు పని చేసి దాదాపు 100 టీఎంసీల నీటిని పంప్ చేసింది.

కాగా చాలా కీలకమైన ఈ పంప్ హౌస్‌లో 3వ మిషన్ 1,110 గంటల పాటు పని చేసి నీటిని ఎత్తిపోసింది. అత్యల్పంగా 13వ మిషన్ 262 గంటల పాటు పనిచేసింది. కాళేశ్వరం మొట్టమొదటి పంప్ హౌస్ ఇదే. ప్రాణహిత నీటిని గోదావరిలోకి ఎత్తిపోయడం లక్ష్మీ పంప్ హౌస్ నుంచే ప్రారంభమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular