fbpx
Saturday, July 27, 2024
HomeAndhra Pradeshఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రద్దు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రద్దు

HIGHCOURT-CANCELS-AP-LOCALBODY-ELECTIONS

అమరావతి: ఏపీ లో శుక్రవారం స్టేట్ ఎలెక్షన్ కమీషన్ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి విదితమే. దీనిపై రాష్ట్రమంతటా తీవ్ర దుమారం రేగింది. ప్రభుత్వం ఎస్ఈసీకి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు కూడా ఈ విషయంలో ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.

ఈ పిటీషను ను స్వీకరించిన హై కోర్టు తాజాగా ఎస్ఈఎసీ ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను కొట్టి వేసింది. రాష్ట్రంలో మరియు దేశంలో నెలకొన్న పరిస్థుతుల నేపథ్యంలో ప్రజారోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించినట్లు అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అవనున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular