fbpx
Friday, April 26, 2024
HomeTelanganaహైదరాబాద్ లో మొహర్రం ఊరేగింపునకు అనుమతి నిరాకరణ

హైదరాబాద్ లో మొహర్రం ఊరేగింపునకు అనుమతి నిరాకరణ

HIGH-COURT-DENIES-MUHARRAM-PARADE

హైదరాబాద్‌: హైద‌రాబాద్‌లో మొహ‌ర్రం పండుగ సందర్భంగా ఊరేగింపున‌కు అనుమ‌తించేలా ఆదేశాలు జారీచేయ‌లేమ‌ని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం ఓ వ్యాజ్యాన్ని విచారిస్తూ అనుమతి నిరాక‌రించిందని పేర్కొన్న న్యాయస్థానం, తాము కూడా ఈ విషయంలో ఎలాంటి అనుమతులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం ఊరేగింపులపై నిషేధం కొనసాగుతోందని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. కాగా మొహర్రం అంబారి ఊరేగింపునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఫాతిమా సేవాదళ్‌ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ సందర్భంగా, ఈ నెల 30న పాత‌బ‌స్తీ డ‌బీర్‌పురా బీబీకా అలావా నుంచి చాద‌ర్ ఘాట్ వ‌ర‌కు మొహ‌ర్రం ఊరేగింపున‌కు అనుమ‌తి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి పోలీస్ క‌మిష‌న‌ర్‌కు ఆదేశాలు జారీచేయాలని కోరింది. ఈ క్రమంలో హైకోర్టు ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా, పిటిష‌నర్ తరఫున కౌన్సిల్ పాండురంగారావు వాదనలు వినిపించారు. ఊరేగింపున‌కై పిటిషనర్, ఇత‌ర రాష్ట్రాల నుంచి ఏనుగుల‌ను సొంత ఖ‌ర్చుల‌తో తెప్పించుకుంటారని, ఇందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలమేమని తేల్చి చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular