fbpx
Thursday, April 25, 2024
HomeLife Styleగ్రీన్ టీ తాగడంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు

గ్రీన్ టీ తాగడంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు

GREEN-TEA-USAGE-TIPS

న్యూఢిల్లీ: గ్రీన్‌ టీ తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఒక వారంలో మూడు సార్లు గ్రీన్‌ టీ తాగితే మనిషి జీవితకాలం పెరగడంతో పాటు గుండెపోటు, స్ర్టోక్‌ ముప్పులను నివారించవచ్చని ఎన్నో అధ్యయాలు తెలిపాయి.

గ్రీన్‌ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌తో హృదయం పదిలంగా ఉండటంతో పాటు ఎక్కువకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు తేల్చారు. కానీ గ్రీన్‌ టీ ఏ సమయంలో తీసుకోవాలో కూడా చాలా ముఖ్యమని చాలా మంది పరిశోధకులు విశ్లేషించారు. కొన్ని సమయాలలో గ్రీన్‌ టీని తీసుకోవద్దని నిపుణులు పేర్కొంటున్నారు.

రాత్రి పడుకునే ముందు:

మీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా, అయితే గ్రీన్‌టీ తీసుకునే సమయంలో జాగ్రత్త వహించాలి. రాత్రి పడుకునే ముందు గ్రీన్‌ టీని సేవిస్తే నిద్రలేమి సమస్యలు ఎదురు కావచ్చు. గ్రీన్‌ టీలోకెఫిన్‌ ఉండడం వల్ల నిద్ర ప్రేరిపిత మెలటోనిన్‌ విడుదలను అడ్డుకుంటుంది.

పగటి పూట గ్రీన్‌ టీ విషయంలో జాగ్రత్త:

ఉదయాన్నే లేచిన వెంటనే ఖాళీ కడుపుతో గ్రీన్‌ టీని సేవించడం అనారోగ్యమని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్‌ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌, పాలీఫినాల్స్‌ గ్యాస్ట్రిక్ యాసిడ్‌లను ప్రేరేపించి, జీర్ణక్రియ సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అందుకే ఉదయాన టిఫిన్‌ చేశాక గ్రీన్‌టీని సేవించడం ఆరోగ్యకరం అని సలహా ఇస్తున్నారు.

గ్రీన్‌టీతో కలిపి మందులు వేసుకోవడం ప్రమాదం..

ఏదయినా వ్యాధితో బాధపడుతున్నట్లయితే కొందరు ఓ కప్పు గ్రీన్‌టీతో మందులు వేసుకుంటారు. కానీ అలా మందులు వేసుకోవడం ఆరోగ్యానికి హానికరం, మందులలో ఉండే కెమికల్స్‌ గ్రీన్‌ టీతో కలిసిన క్రమంలో అసిడిటీ సమస్యలు ఉత్పన్నమైన అవకాశముంది.

భోజన సమయంలో జాగ్రత్త:

సాధారణంగా గ్రీన్‌ టీ సేవిస్తే జీర్ణకక్రియ సమస్యలకు ఎంతో ఉపయోగం. కానీ మధ్యాహ్న భోజనం తరువాత గ్రీన్‌టీ సేవిస్తే భోజనం నుంచి లభించే పోషక వలువలు తగ్గి, పోషకాహార లోప సమస్యలు తలెత్తె అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular