fbpx
HomeLife Styleఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ మొబైల్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ మొబైల్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

FLIPKART-BIG-SAVINGS-DAY-SALE-HUGE-DISCOUNTS-ON-MOBILES

ముంబై: భారత ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో వస్తోంది. ఈ సీజన్ లో కొత్తగా మొబైల్‌ ఫోన్లను కొనాలనుకునేవారికి శుభవార్త. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ పేరుతో వినియోగదారులకు ప్రత్యేక సేల్‌ను నిర్వహించనుంది. ఈ నెల 13 నుంచి 16 వరకు ఈ ప్రత్యేక సేల్‌ కొనసాగనుంది.

అయితే ఈ సేల్‌లో మొబైల్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందించనుంది ఫ్లిప్ కార్ట్. ఈ సేల్ లో దాదాపు అన్ని ప్రముఖ కంపెనీల మొబైల్‌ ఫోన్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఆఫర్ ఉన్న మొబైల్స్ లో గూగుల్‌ పిక్సెల్‌, ఐఫోన్‌, ఆసుస్‌, శాంసంగ్‌ గెలాక్సీ తదితర ఫోన్ల ధరలను ఫ్లిప్‌కార్ట్‌ విడుదల‌ చేసింది.

కాగా ఈ సేల్ లో ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్స్‌కు ఒక రోజు ముందుగానే అనగా జూన్‌ 12వ తేదీ అర్ధరాత్రి నుంచే బిగ్‌ సేవింగ్‌ డేస్‌ అందుబాటులోకి వస్తాయి. మొబైల్‌ ఫోన్లతో పాటుగా ఆఫర్లు ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లపై 80 శాతం వరకు, స్మార్ట్‌ వాచ్‌లపై 60 శాతం వరకు, టాబ్లెట్‌లపై 50 శాతం వరకు, డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లపై సుమారు 30శాతం వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి.

అధిక ధరల స్మార్త్ మొబైల్స్ తో పాటు బడ్జెట్‌ ఫ్రెండ్లీ మొబైల్‌ ఫోన్స్‌ జియోనీ మ్యాక్స్‌ ప్రో, ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌ 5, మైక్రోమ్యాక్స్‌ ఇన్‌ నోట్‌ 1 ఫోన్లపై కూడా ఈ సేల్ లో భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. వీటితో పాటు అదనంగా ఎస్బీఐ కార్డు ద్వారా షాపింగ్‌ చేసే వినియోగదారులకు పది శాతం ఇన్‌స్టాంట్‌ తగ్గింపు కూడా లభించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular