fbpx
HomeMovie Newsవరుసగా సినిమాలని సిద్ధం చేస్తున్న పుష్ప విలన్

వరుసగా సినిమాలని సిద్ధం చేస్తున్న పుష్ప విలన్

FaahadFaasil ComingUpWith NumberOfReleases

మాలీవుడ్: మలయాళం లో స్టార్ హీరోగా, మంచి నటుడిగా, నేషనల్ అవార్డు పొందిన నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫాహద్ ఫాసిల్. ఈ నటుడు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. వరుసగా ఓటీటీ సినిమాలని కూడా విడుదల చేస్తున్న ఈ హీరో ప్రస్తుతం ఒక మూడు నాలుగు సినిమాలని విడులకి సిద్ధం చేసాడు. లాక్ డౌన్ సమయంలో కేవలం ఇంట్లోనే కూర్చొని ‘సి యూ సూన్’ లాంటి సినిమాని రూపొందించి విడుదల చేసి హిట్ కొట్టాడు.

ప్రస్తుతం ఫాహద్ హీరోగా రూపొందిన ఇరుల్ సినిమా నెట్ ఫ్లిక్ లో విడుదలైంది. ఒక క్రైం థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఓటీటీ లో నిన్న విడుదలై మంచి రెస్పాన్స్ సాధించింది. ఇదే కాకుండా ‘మాలిక్’ అనే పొలిటికల్ థ్రిల్లర్ మూవీ లో కూడా నటిస్తున్నాడు. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభించింది.

నిన్న ‘జోజి’ అనే మరో సినిమా ట్రైలర్ విడుదల చేసారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్న ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒక ఇంట్లో జరిగే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందించారు. ట్రైలర్ చూడగానే ఈ సినిమాని చూసేలా ఇంటరెస్ట్ చేయగలిగాడు డైరెక్టర్. ‘మహేషింటే ప్రతీకారం’ సినిమాని రూపొందించిన డైరెక్టర్ ఫాహద్ తో కలిసి రెండోసారి ఈ సినిమాకి పనిచేయనున్నాడు.

వీటితో పాటు తెలుగులో పుష్ప లో కూడా నటిస్తున్నాడు ఈ హీరో. వచ్చే రెండు, మూడు నెలల్లో ఫాహద్ నటించిన దాదాపు నాలుగు సినిమాలు విడుదలకి సిద్ధం అవుతున్నాయి. మంచి నటుడిగానే కాకుండా ఎక్కువ సినిమాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తోటి నటులకి ఫాస్ట్ మూవీ మేకింగ్ లో ఇన్స్పిరేషనల్ గా కూడా నిలుస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular