fbpx
HomeSportsధోనికి ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ ద డికేడ్‌ అవార్డ్

ధోనికి ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ ద డికేడ్‌ అవార్డ్

DHONI-SPIRIT-OF-DECADE-WINNER-FROM-ICC

దుబాయ్‌: ఐసీసీ ప్రకటించిన ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల అవార్డుల్లో టీమిండియా కెప్టెన్‌ కోహ్లి రెండు అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల ఐసీసీ నామినేట్‌ చేసిన ఐదు అవార్డులకు కోహ్లి నామినేట్‌ కాగా అతన్ని అందులో రెండు అవార్డులు వరించాయి. అవర్డుల్లో ఒకటి సర్‌ గార్ల్‌ఫీల్డ్‌ సోబర్స్‌ అవార్డు ఫర్‌ ఐసీసీ మేల్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద డెకేడ్‌ అవార్డు కాగా, మరొకటి దశాబ్దపు మెన్స్‌ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద డెకేడ్‌ అవార్డు కూడా కోహ్లి గెలుచుకున్నాడు.

అయితే ఈ దశాబ్దపు స్పిరిట్‌ ఆఫ్‌ ద క్రికెటర్‌ అవార్డు మాత్రం టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి దక్కింది. ధోనికి ఈ దశాబ్దపు స్పిరిట్‌ ఆఫ్‌ ద క్రికెట్‌ అవార్డు లభించడం మాత్రం అన్నింటికంటే ఎక్కువ వార్తల్లో నిలిచింది. ధోనికి ఈ అవార్డు ఎందుకు దక్కింది అని తెలుసుకోవాలంటే 9 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే.

భారత్ 2011 ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టెస్ట్ మాత్రం అతని కెప్టెన్సీ కెరీర్‌కే ప్రత్యేకం. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికీ తన క్రీడా స్పూర్తి విషయంలో యావత్ క్రికెట్ ప్రపంచం ముందు విజేతగా నిలబడి ప్రశంసలు అందుకుంది.

ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ మ్యాచ్ బ్యాట్స్‌మన్ అలసత్వానికి ఒక గుణపాఠంగా నిలిచింది. ముఖ్యంగా ఇందులో ఇయాన్ బెల్ వివాదస్పద రనౌట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ట్రెంట్ బ్రెడ్జ్ వేదికగా జరిగిన నాటి రెండో టెస్ట్ మూడో రోజు ఆట ఓ డ్రామాను తలిపించింది. టీ బ్రేక్ సమయం ముందు ఇషాంత్ శర్మ వేసిన 66వ ఓవర్ చివరి బంతిని నాటి ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఇయాన్ మోర్గాన్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా చక్కటి షాట్ ఆడాడు. దాదాపు బౌండరీ అనుకుంటుండగా, ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న ప్రవీణ్ కుమార్ అద్భుత డైవ్‌తో బంతిని అడ్డుకున్నాడు.

కానీ అది ఫోరా? కాదా? అనే సందిగ్ధత నెలకొంది. ఈ లోపు ఇయాన్ బెల్, మోర్గాన్ మూడు పరుగులు పూర్తి చేశారు. అయితే అది టీ బ్రేక్ ముందు బంతి కావడం, బౌండరీ పోయిందనే అలసత్వంతో ఇయాన్ బెల్ మూడో పరుగు తర్వాత నాలుగో రన్ కోసం సగం క్రీజు వరకు పరుగెత్తుకొచ్చి ఆగిపోయాడు. బంతిని అందుకున్న ధోని తెలివిగా స్టంప్స్‌ వద్ద ఉన్న సాహాకు బంతి విసిరడంతో అతను వికెట్లను గిరటేశాడు.

అప్పుడూ మైదానం అంతా అయోమయం నెలకొంది. అంపైర్లకు కఠిన సవాల్ ఎదురైంది. ముందుగా ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సాయంతో బంతి బౌండరీనా? కాదా? అని పరీక్షించారు. బంతి బౌండరీ వెళ్లలేదని తేలడంతో, భారత ఫీల్డర్లు అప్పీల్ చేశారా? లేదా ? అని పరీక్షించారు. వారు అప్పీల్ చేయడంతో మరోసారి ధోనీని ప్రశ్నించారు. అతను అప్పీల్ వెనక్కు తీసుకోవడానికి నిరాకరించడంతో నిబంధనల మేరకు ఇయాన్ బెల్‌ను రనౌట్‌గా ప్రకటించారు.

కాగా ఈ నిర్ణయంతో అవాక్కైన ఇయాన్, ఓవర్ పూర్తయిందనే మాట విన్నానని, బెయిల్స్ కిందపడేయంతోనే ఆగిపోయానని అంపైర్లకు తెలుపుతూ అసంతృప్తితో మైదానం వీడాడు. టీ బ్రేక్ సమయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పటి ఇంగ్లండ్ కోచ్ అండీ ఫ్లవర్, కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ లు ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళి ఇయాన్ ఔట్ అప్పీల్‌ను ఉపసంహరించుకోవలసిందిగా ధోనిని కోరడంతో ఇయాన్ బెల్ క్రీజులోకి అడుగుపెట్టాడు.

దీంతో ఇంగ్లండ్ అభిమానులు ధోనీని కొనియాడారు. క్రీడా స్పూర్తి చాటాడని హీరో అంటూ ప్రశంసించారు. ధోని క్రీడాస్పూర్తి చాటడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఇక ఈ నిర్ణయంతో అప్పట్లోనే ధోని ఐసీసీ స్పిరిట్ క్రికెట్ ఆఫ్ ద అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఆ రనౌట్‌ను వెనక్కి తీసుకోవడంతోనే ఇప్పుడు ధోనికి స్పిరిట్‌ ఆఫ్‌ ద క్రికెట్‌ అవార్డు ఆఫ్‌ డికేడ్‌ దక్కడం ఇప్పుడు విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular