fbpx
Monday, March 4, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeAndhra Pradeshఏపీ పోలిస్ నుంచి ఏపీ పోలీస్ సేవ యాప్

ఏపీ పోలిస్ నుంచి ఏపీ పోలీస్ సేవ యాప్

AP-POLICE-SEVA-APP-FROM-AP-POLICE
AP POLICE SEVA APP

అమరావతి : అధికారం లో కి వచ్చిన తక్కువ కాలానికే అనేక సంస్కరణలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర పోలీస్‌ శాఖ సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ రూపొందించిన ఈ కొత్త యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ యాప్‌ ద్వారా ప్రజలు పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లే అవసరం లేకుండా 87 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని నేరాలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశంతో పాటు ఫిర్యాదులకు రశీదు కూడా పొందే అవకాశం ఉంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదులతో పాటు అత్యవసర సమయాల్లో వీడియో కాల్‌ చేసే సౌకర్యం కూడా ఉంది. ముఖ్యంగా మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి.

దర్యాప్తు పురోగతి, అరెస్ట్‌లు, ఎఫ్‌ఐఆర్‌లు, రికవరీలు, రహదారి భద్రత, సైబర్‌ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు కూడా ఈ యాప్‌ ద్వారా పొందవచ్చు. వీటితో పాటు ఎన్‌వోసీలు, లైసెన్సులు,పాస్‌పోర్ట్‌ సేవలు, ఇతర వెరిఫికేషన్లు ఇలా అన్ని రకాల పోలీసు సేవలను అందుబాటులో ఉంటాయి. మీడియాలో వైరల్‌ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ యాప్‌లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 మాడ్యూల్స్‌తో మహిళల కు రక్షణగా, తోడు నీడగా అన్ని వేళల్లో పోలీసులు తమకు రక్షణ ఉన్నారు అనే భావనతో వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా ఈ యాప్ సేవలను అందిస్తుంది.

తాడేపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ‌ పాటు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతవ్‌ సవాంగ్‌ ముఖ్య పోలీసు అధికారులు పాల్గొన్నారు. యాప్‌ విశిష్టతను సీఎంకు వివరించారు. ఈ యాప్‌ ద్వారా పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటలైజేషన్‌ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఈ పోలీస్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలనే  సంకల్పంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు డీజీపీ తెలిపారు.

అందుబాటులో ఉన్న సేవలు:

శాంతి భద్రతలు..
♦నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు
♦ఎఫ్‌ఐఆర్‌ స్థితిగతులు, డౌన్‌లోడ్‌
♦దొంగతనం ఫిర్యాదులు/ రికవరీలు
♦తప్పిపోయిన కేసులు /దొరికిన వారు/గుర్తు తెలియని మృతదేహాలు
♦అరెస్టుల వివరాలు
♦వాహనాల వివరాలు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సేవలు..

♦ఇంటి పర్యవేక్షణ(లాక్‌మానిటరింగ్‌ సర్వీసు(ఎల్‌ఎంఎస్‌) , ఇ–బీట్‌)
♦ఈ–చలానా స్టేటస్‌

పబ్లిక్‌ సేవలు..
♦నేరాలపై ఫిర్యాదులు
♦సేవలకు సంబంధించిన దరఖాస్తులు
♦ఎన్‌వోసీ, వెరిఫికేషన్లు
♦లైసెన్సులు, అనుమతులు
♦పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌

రహదారి భద్రత..
♦బ్లాక్‌ స్పాట్లు
♦యాక్సిడెంట్‌ మ్యాపింగ్‌
♦రహదారి భద్రత గుర్తులు
♦బ్లడ్‌ బ్యాంకులు, డయాలసిస్‌ కేంద్రాలు, ఆసుపత్రులు, మందుల దుకాణాల వివరాలు

ప్రజా సమాచారం..
♦పోలీస్‌ డిక్షనరీ
♦సమీపంలోని పోలీస్‌స్టేషన్‌
♦టోల్‌ఫ్రీ నంబర్లు
♦వెబ్‌సైట్ల వివరాలు
♦న్యాయ సమాచారం
♦ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబర్లు

AP POLICE SEVA APP

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular