fbpx
Saturday, April 1, 2023

INDIA COVID-19 Statistics

44,715,786
Confirmed Cases
Updated on April 1, 2023 4:45 am
530,867
Deaths
Updated on April 1, 2023 4:45 am
15,208
ACTIVE CASES
Updated on April 1, 2023 4:45 am
44,169,711
Recovered
Updated on April 1, 2023 4:45 am
HomeAndhra Pradeshఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్ తో ఏపీ ఒప్పందం

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్ తో ఏపీ ఒప్పందం

AP-COLLABORATION-WITH-ISB

అమరావతి: మహమ్మారి కరోనా వైరస్ నేపథ్యంలో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిలో పెట్టడం మరియు కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది.

దీనిలో భాగంగా ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)తో బుధవారం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి సమక్షంలో ఏపీ ఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐఎస్‌బీ డీన్‌ ప్రొఫెసర్‌ రాజేంద్ర శ్రీవాత్సవ సంతకాలు చేయడం ద్వారా వర్చువల్‌ ఒప్పందం జరిగింది.

ఏపీని అభివృద్ధి పథంవైపు నడిపేందుకు ఐఎస్‌బీతో కలిసి ‘పబ్లిక్‌ పాలసీ ల్యాబ్‌’ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ల్యాబ్‌ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించే పారదర్శకత, జవాబుదారీతనం, త్వరితగతిన కచ్చితమైన నిర్ణయాలు, ఖర్చులను తగ్గించడం లాంటి లక్ష్యాలను సాధించి పాలనను ప్రజల ముంగిటకు తెస్తామన్నారు.

తాజా ఒప్పందంతో పారిశ్రామిక, నైపుణ్య, పెట్టుబడి రంగాలలో సంస్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.కరికాల వలవన్‌ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవడం తమ బాధ్యతను మరింత పెంచిందని ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అశ్విని ఛాట్రే పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular