హైదరాబాద్: లాక్ డౌన్ కి కొంచెం ముందు వచ్చి మంచి టాక్ తెచ్చుకున్న సినిమా ‘పలాస 1978 ‘. అయితే ఈ సినిమాని ఈ మద్యే వీక్షించిన బన్నీ ఈ సినిమా మేకర్స్ ని ప్రశంసించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీకాకుళం జిల్లాలో ‘పలాస’ అనే ప్రదేశంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. లండన్ బాబులు చిత్రంలో నటించిన ‘రక్షిత్’ , నక్షత్ర జంటగా నటించిన ఈ చిత్రాన్ని కరుణ కుమార్ అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. ఇందులో సింగర్ రఘు కుంచె ప్రత్యేక పాత్రలో మెరిసి ఆకట్టుకున్నాడు. సమాజంలో కొన్ని కులాలని ఎంత తక్కువగా చూస్తారో, కుల వివక్షలు ఎంత దారుణంగా ఉంటాయో ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు.
ఈ సినిమాకి రఘు కుంచె అందించిన సంగీతం నుండి ‘నాది నాక్కిలేసు గొలుసు’ అనే పాట బాగా ఫేమస్ అయింది. అయితే ఈ చిత్రాన్ని కాస్త ఆలస్యంగా చూసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చూసిన మరుసటి రోజే డైరెక్టర్ ని పిలిచి అభినందించాడు. వ్యక్తిగతం గా తనకి ఈ సినిమా చాలా బాగా నచ్చిందని, చాలా మంచి మెసేజ్ ఉందని, ఇలాంటి కొత్త దర్శకులు ఇండస్ట్రీ కి రావడం ఆకట్టుకోవడం శుభపరిణామం అని చెప్పారు బన్నీ. అలాగే పలాస 1978 టీం మొత్తానికి అభినందనలు తెలిపాడు బన్నీ. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఈ సినిమా గురించి తెలియదు.. అయినా కూడా ఒక చిన్న సినిమా గా వచ్చి ఇంత మంచి విజయం సాధించినందుకు లేటుగా గుర్తింపు వచ్చినా కూడా మంచి గుర్తింపు వచ్చినందుకు సినిమా టీం సంతోషపుడుతున్నారు.