fbpx
Tuesday, June 6, 2023

INDIA COVID-19 Statistics

44,991,880
Confirmed Cases
Updated on June 6, 2023 8:59 am
531,884
Deaths
Updated on June 6, 2023 8:59 am
3,001
ACTIVE CASES
Updated on June 6, 2023 8:59 am
44,456,995
Recovered
Updated on June 6, 2023 8:59 am
HomeMovie Newsచంద్ర శేఖర్ యేలేటి తో 'చెక్' పెట్టనున్న నితిన్

చంద్ర శేఖర్ యేలేటి తో ‘చెక్’ పెట్టనున్న నితిన్

Nithin CheckMovie withDirectorChandraShekarYeleti

టాలీవుడ్: ఈ సంవత్సరం ఆరంభం లో భీష్మ లాంటి పెద్ద సక్సెస్ అందుకొని పెళ్లి కూడా చేసుకున్న హీరో నితిన్. ఈ హీరో తన సినిమాల విషయంలో దూకుడు పెంచాడు. ఈ హీరో దగ్గరినుండి ప్రస్తుతం మూడు సినిమాలు సిద్ధం అవుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు సాగితే వచ్చే సంవత్సరం మొదటి హాఫ్ లోనే ఈ మూడు సినిమాలు విడుదల అవచ్చు. ప్రస్తుతం చేస్తున్న ‘రంగ్ దే’ షూటింగ్ ముగింపు దశలో ఉంది. అలాగే ‘అందాదున్’ రీమేక్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. వీటితో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు అని తెలుసు కానీ దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే సడన్ సర్ప్రైస్ లాగా ఇవాళ ఈ సినీమా టైటిల్ విడుదల చేసింది సినిమా టీం.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై విలక్షణ చిత్రాల దర్శకుడు ‘చంద్ర శేఖర్ యేలేటి‘ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమాకి ‘చెక్’ అనే పేరు తో టైటిల్ లుక్ ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ చేతుల మీదుగా విడుదల చేసారు. టైటిల్ పోస్టర్ సరికొత్త కాన్సెప్టుతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓ కేసు విషయమై డ్రామా నేపథ్యంలో ఆద్యంతం గ్రిప్పింగ్ గా రూపొందిస్తున్న సినిమా ఇదని తెలుస్తోంది. నితిన్ చేతికి భేడీలు జైలు చుట్టూ బారికేడ్లు , చదరంగం కాన్సెప్ట్ చూస్తుంటే ఆద్యంతం థ్రిల్లింగ్ గా ఉంటుందనే అర్థమవుతోంది.ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ – ప్రియా వారియర్ నాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ లుక్ ని విడుదుల చేస్తూ ‘చంద్ర శేఖర్ యేలేటి’ తన ఫేవరేట్ డైరెక్టర్ అని కితాబిచ్చాడు కొరటాల శివ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular