fbpx
Friday, April 26, 2024
HomeMovie Newsఅల్లరి నరేష్ 'నాంది' ఫస్ట్ లుక్

అల్లరి నరేష్ ‘నాంది’ ఫస్ట్ లుక్

Allari Naresh Naandi

అల్లరి నరేష్ ‘నాంది’ ఫస్ట్ లుక్

హైదరాబాద్: అల్లరి నరేష్ రెగ్యులర్ పంథా లో కాకుండా అప్పుడప్పుడు తీసే ప్రయోగాత్మక చిత్రాలు అతని లో ఎంత గొప్ప నటుడు దాగి ఉన్నాడో ‘నేను’, ‘శంభో శివ శంభో’ లాంటి సినిమాలు చూస్తే తెలుస్తుంది. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ అలాంటి సినిమాతో వస్తున్నాడు అల్లరి నరేష్. తాను తీసిన తదుపరి సినిమా ‘నాంది’ ఫస్ట్ లుక్ ఈరోజే విడుదల చేసారు. అల్లరి నరేష్ 57వ చిత్రంగా రూపొందించిన ఈ సినిమా ‘నాంది’ – ఎ న్యూ బిగినింగ్’ సామాజిక అంశాలతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ అని అనిపిస్తోంది. ఎక్కువ శాతం కామెడీ చిత్రాలతో అలరించే అల్లరి నరేష్ తన శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ కథనాలతో ఈ సినిమా ఉండబోతోంది.

ఈ పోస్టర్ లో అల్లరి నరేష్ ఒంటి మీద దుస్తులు లేకుండా గాయాలతో ఉన్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్టుగా జూన్ 30న ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ చేయబోతున్నట్లు అల్లరి నరేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ”జూన్ 30 మంగళవారం – మీరందరూ ‘నాంది’ యొక్క ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ చేస్తున్నాం” అంటూ ట్వీట్ చేసారు. ఈ పోస్టర్ లో అల్లరి నరేష్ ఒంటి పై నూలు పోగు లేకుండా నగ్నంగా తన రెండు చేతులను తల వెనుక పెట్టి పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఉన్నాడు. ఈ పోస్టర్ లో అల్లరి నరేష్ విభినమ్మైన లుక్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగేలా చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular