హైదరాబాద్: ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్టాల ఎయిర్‌టెల్ వినియోగదార్లకు శుభవార్త తెలిపింది. టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్‌టెల్ తన రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ ను తాజాగా సవరించింది. ఈ కొత్త ప్లాన్ ద్వారా తమ యూజర్లు మరింత డేటాను పొందవచ్చు అని ఎయిర్‌టెల్ పేర్కొంది.
ఈ సవరించిన రూ.199 ప్లాన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల టెలికాం సర్కిల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. మిగతా రాష్ట్ర యూజర్లకు త్వరలోనే ఈ ప్లాన్ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు ఈ రూ.199 ప్లాన్ కింద రోజూ 1జీబీ డేటాను పొందుతుండగా, ఇప్పుడు వారికి రోజూ 1.5జీబీ డేటా లభించనుంది.
ఈ ప్లాన్ లో 1.5జీబీ రోజువారీ డేటా కోటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు మరియు అపరిమిత కాలింగ్ సేవలను అందించనుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజుల వరకు ఉటుంది. రీఛార్జ్‌తో పాటు ఎయిర్‌టెల్ యూజర్లు వింక్ మ్యూజిక్, హెలోట్యూన్‌లను యాక్సెస్ చేయగలరు. అలాగే, యూజర్లు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ ఉచిత సేవలను కూడా పొందవచ్చు.
రూ.249 కింద రోజుకు 1.5 జిబి డేటాను, 100 ఎస్ఎంఎస్, 28 రోజుల కాలానికి అపరిమిత కాలింగ్ సేవలను కూడా అందిస్తుంది. రెండు ప్లాన్‌లు ఒకే విదంగా ఉన్న కారణంగా దీనిని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌టెల్ త్వరలో రూ.249 ప్లాన్‌లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది.