మూవీ డెస్క్: ‘సైరా నరసింహా రెడ్డి’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ, చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ ‘సిద్ధ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో అలరించనున్నారు.
పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల జరిగింది.
రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేసే డ్యాన్స్, ఫైటింగ్‌లు అభిమానులకు సూపర్ ఐ ఫీస్ట్‌గా ఉండనున్నట్లు ట్రైలర్ లో కనిపిస్తోంది.
ఈ ట్రైలర్ లింక్ ఇక్కడ మీకోసం: ఆచార్య ట్రైలర్