fbpx
HomeMovie News‘ఆకాశవాణి’ ఫస్ట్ లుక్

‘ఆకాశవాణి’ ఫస్ట్ లుక్

Aakashavani FirstLook Released

హైదరాబాద్: తెలుగు టాప్ డైరెక్టర్ యస్ యస్ రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘ఆకాశవాణి’. ఈ సినిమా మొదలు రాజమౌళి మరియు కీరవాణి వారసులు ప్రారంభించారు, కానీ కొన్ని కారణాల వలన రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. అప్పటినుండి ఈ సినిమా ఎదో ఒక కారణంతో ఆలస్యం అవుతూనే వస్తుంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. కాల భైరవ ఇపుడిపుడే తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే దశలో ఉన్నాడు.

సినిమా ఫస్ట్ లుక్ ని ఫ్రెండ్ షిప్ డే సందర్భం గా ఈరోజు విడుదల చేసారు. అయితే ఏదైనా ఫస్ట్ లుక్ విడుదల అయినపుడు హీరో నో , హీరోయిన్ నో లేదా స్టోరీ ఇలా ఉంటుంది అని ఏదో ఒక విషయం తెలిసేలా హింట్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మాత్రం అలాంటిదేమి లేకుండా కొత్తగా ఉంది. వూరు చివరన ఊడలకి ఒక పిల్లవాడు వేలాడుతో కనిపిస్తూ ఉంటాడు. మరో వైపు పాత కాలం రేడియో ఉంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఈ రోజు హీరో దగ్గుబాటి రానా విడుదల చేసారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular