fbpx
HomeUncategorizedసైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందిన 'A ' మూవీ ట్రైలర్

సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందిన ‘A ‘ మూవీ ట్రైలర్

ADInfinitium Movie TrailerReleased

టాలీవుడ్: అప్పుడప్పుడు కొన్ని కొత్త సినిమాలు ఒక వెరైటీ కాన్సెప్టుతో వచ్చి ఆకట్టుకుంటాయి. కానీ స్టార్ కాస్ట్ లేకపోవడం తో అంతగా ఆదరణకు నోచుకోవు. అలాంటి క్యాటగిరి సినిమా ఒకటి టాలీవుడ్ లో రూపొందింది. సైన్స్ ఫిక్షన్ జానర్ లో ‘A ‘ అని ఒక సినిమా రూపొందింది. ఈ రోజు ఆ సినిమాకి సంబందించిన ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం మనిషి కలలకి మరియు మెడికల్ ప్రయోగాలకి సంబందించిన సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంది.

ఇద్దరు వ్యక్తులకి ఒకే రకమైన కలలు రావడం, ఆ వ్యక్తులకి ఏమైనా సంబంధం ఉందా అని పోలీసులు ఇంటర్రోగేషన్ చెయ్యడం లాంటి సీన్స్ ట్రైలర్ లో చూపించారు. వీటికి మెడికల్ ప్రయోగాలకి సంబంధం ఏంటి, హీరో రక రకాల వేషధారణలో కనిపిస్తుంటాడు.. ఇలా రక రకాల అంశాలని ట్రైలర్ లో చూపించారు. ‘ఇప్పుడు జ్వరం వస్తే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటున్నారు కానీ ఆ టాబ్లెట్ కనుక్కోవడానికి ఎంత మంది చనిపోయారో తెలుసా..’ అంటూ సినిమాలో మెడికల్ మాఫియా యాంగిల్ ని చూపించారు. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు అనుభవ రాహిత్యం వలన ప్రేక్షకులకి పూర్తి అర్ధమయ్యే రీతిలో తియ్యలేకపోతారు. మరి ఈ సినిమా ఆ కోవలోకి చేరుతుందా లేదా అనేది సినిమా వచ్చేంత వారికి వేచి చూడాలి.

ట్రైలర్ లో హీరో రక రకాల టైం పీరియడ్ లో రకరకాల వేషాలు కనిపిస్తుంటాయి. మరి వాటన్నిటికీ గల కారణాలు సరిగ్గా మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే తో చెప్పగలిగితే థియేటర్లలో కాకపోయినా ఓటీటీల్లో విడుదల అయిన తర్వాత అయినా జనాలు ఆదరిస్తారు. ఈ సినిమా ట్రైలర్ ని తమిళ్ టాప్ హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదల చేయించారు. అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై గీతా మిన్సా ఈ సినిమాని నిర్మించారు. యుగంధర్ ముని ఈ సినిమాని దర్శకత్వం వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular