fbpx
HomeMovie Newsఒక్క ప్రకటన తో రూమర్స్ కి చెక్ పెట్టిన సూపర్ స్టార్

ఒక్క ప్రకటన తో రూమర్స్ కి చెక్ పెట్టిన సూపర్ స్టార్

KeerthiSuresh WithMaheshBabuFor SarkaaruVaariPaata

టాలీవుడ్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ బుజ్జి తో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా హీరోయిన్ ఎవరు అనే విషయం లో ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే ఏదీ రాలేదు. ఇదివరకే ఒక ఆన్లైన్ చాట్ సెషన్ లో ‘కీర్తి సురేష్’ తాను ‘సర్కారు వారి పాట’ లో చేయబోతున్నాను అని చెప్పినా కూడా ఈ సినిమా హీరోయిన్ పలానా వాళ్ళు అని రక రకాల పేర్లు వినిపించాయి. వాటన్నిటిని పటా పంచలు చేసాడు హీరో మహేష్ బాబు.

ఈరోజు మహానటి ‘కీర్తి సురేష్’ పుట్టిన రోజు సందర్భంగా ‘సర్కారు వారి పాట’ టీం నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘సర్కారు వారి పాట’ సినిమాలోకి స్వాగతం అని తెలిపాడు. దీనితో ఇన్ని రోజులు హీరోయిన్ గురించి వస్తున్న వార్తలకి చెక్ పడినట్లే అనవచ్చు. లేదా సెకండ్ హీరోయిన్ అని సర్ది చెపుతారో ఏమో తెలియదు ఈ రూమర్స్ బాచ్. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్, GMB ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం కీర్తి సురేష్ నితిన్ తో ‘రంగ్ దే’ అలాగే ‘గుడ్ లక్ సఖి‘ అనే సినిమాల్లో నటిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular